చుంకత్ జోసెఫ్ వర్కే
చుంకత్ జోసెఫ్ వర్కే, KSG (1891 – 1953), భారతీయ ప్రొఫెసరు, పాత్రికేయుడు, మద్రాస్ ప్రెసిడెన్సీలో విద్యా మంత్రి. [1] [2] [3]
జీవిత విశేషాలు
[మార్చు]వర్కే 1891లో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. అతను మంగళూరు లోని సెయింట్ అలోసియస్ కాలేజీలో ప్రొఫెసరుగా పనిచేసాడు. ఆల్ ఇండియా కాథలిక్ లీగ్‌కు (ఇప్పుడు ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్) కార్యదర్శిగా కూడా పనిచేసాడు. 1937-42 కాలంలో మద్రాసు శాసనసభలో పశ్చిమ తీర భారతీయ క్రైస్తవ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. వర్క్జే, ది కాథలిక్ ఎడ్యుకేషనల్ రివ్యూ వ్యవస్థాపక-సంపాదకుడుగా కూడా పనిచేసాడు. సి. రాజగోపాలాచారి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు 1937 ఎన్నికలలో విజయం సాధించి మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారాన్ని చేపట్టినపుడు, వర్కే విద్యాశాఖ కార్యదర్శి అయ్యాడు. 1939లో సుబ్బరాయన్ తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ సంవత్సరం కాంగ్రెసు మంత్రివర్గానికి రాజీనామా చేసే వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు. పోప్ పియస్ XI అతన్ని నైట్ ఆఫ్ సెయింట్ గ్రెగోరీగా (KSG) నియమించాడు. [4] [5]
మూలాలు
[మార్చు]- ↑ Burnand, Francis Cowley (1941). The Catholic who's who and yearbook. Vol. 34. Burns & Oates. p. 504.
- ↑ Farias, Kranti K (1999). The Christian impact in South Kanara. Church History Association of India. p. 274.
- ↑ The who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency, Issue 9. Pearl Press. 1940. p. 277.
- ↑ "Indian Papal Knight".
- ↑ Justice Party golden jubilee souvenir, 1968. Justice Party. 1968. p. 58. ISBN.