చునిబాలా దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చునిబాలా దేవి
జననం1872
మరణం1955
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

చునిబాలా దేవి (1872–1955), బెంగాలీ సినిమా నటి. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన పథేర్ పాంచాలి సినిమాతో తన నటనకు ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో అపు, దుర్గాలకు వృద్ధ అత్త ఇందిర్ ఠాక్రున్‌ పాత్రలో నటించింది.[1]

జననం[మార్చు]

చునిబాలా 1872లో కలకత్తాలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

నాటకరంగంలో అనేక నాటకాలలో నటించిన చునిబాలా, 1930లో బిగ్రాహా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. రెండవ చిత్రం రిక్తా విడుదలయిన తరువాత 1939లో సినిమాలు మానేసింది. తన సినిమాలోని కీలకమైన పాత్రలో నటించడానికి సత్యజిత్ రే, 80 సంవత్సరాల వయస్సులో ఆమెను ఒప్పించి నటింపజేశాడు. ఇందిర థాక్రున్ పాత్రకు మనీలా ఫిల్మ్ ఫెస్టివల్ అనే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడు/నటి విభాగంలో అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా నిలిచింది.[2][3][4]

మరణం[మార్చు]

ఇన్‌ఫ్లుఎంజా వ్యాధితో చునిబాలా 1955లో కోల్‌కతాలో (పథేర్ పాంచాలి విడుదలకు ముందు) మరణించింది. అయినప్పటికీ సత్యజిత్ రే ఆమెకు ఒక ప్రొజెక్షన్ చూపించడానికి ఆమె ఇంటికి వెళ్ళాడు.

సినిమాలు[మార్చు]

  • బిగ్రాహ - ది గాడ్ అండ్ ది ఇమేజ్ (1930)
  • రిక్తా (1939)
  • పథేర్ పాంచాలి - సాంగ్ ఆఫ్ ది రోడ్ (1955)

మూలాలు[మార్చు]

  1. Janet Farrell Brodie; Marc Redfield (2002). High Anxieties: Cultural Studies in Addiction. University of California Press. p. 156. ISBN 978-0-520-22751-4.
  2. "In focus: Ray and the tale of an old actress".
  3. Ray, Satyajit. "How Satyajit Ray found Indir Thakrun, the scene-stealer of 'Pather Panchali'". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-05.
  4. Live, A. P. N. (2017-02-01). "Remembering Chunibala Devi". APN Live (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-07. Retrieved 2021-02-05.
  • Alva, Joachim (January 1957). "The Late Chunibala Devi". Forum: The Indian Monthly Magazine. Chittaranjan Publishers.

బయటి లింకులు[మార్చు]