పథేర్ పాంచాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పథేర్ పాంచాలి (బెంగాలీ-pɔt̪ʰer pãtʃali, తెలుగు అర్థం-చిన్న దారి పాట) సత్యజిత్ రే దర్శకత్వంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్మించిన 1955 నాటి బెంగాలీ చలనచిత్రం. 1928లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రాసిన పథేర్ పాంచాలి నవల ఈ సినిమా కథకు ఆధారం. ఇది సుప్రసిద్ధ భారతీయ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వం వహించిన తొలి సినిమా. అపు చిత్రత్రయంలో పథేర్ పాంచాలి మొదటిది - దీనిలో అపు బాల్యం చిత్రీకరించారు. ఈ చిత్రం 1955లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ బెంగాలీ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది.

ఇతివృత్తం[మార్చు]

బెంగాలీ బ్రాహ్మణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అపు అనే పిల్లాడి బాల్యం ఇందులో ప్రధాన ఇతివృత్తం. ప్రధానంగా కథంతా బెంగాల్ లోని ఓ పల్లెటూర్లో సాగుతుంది. అపు తల్లిదండ్రులు సర్బజయ, హరిహరరాయ్, అతని అక్క దుర్గ. పూజారిగా పనిచేస్తున్న హరిహరరాయ్ కుటుంబం పేదరికంతో బాధపడుతూ ఉంటుంది. హరిహరరాయ్ వరుసకు అక్కగారైన ముసలి స్త్రీ ఇందర్ ఠాకూర్న్ కూడా వారితోనే నివసిస్తూంటారు. కొన్నాళ్ళకు ఇందర్ మరణిస్తారు. అంతేకాక దురదృష్టవశాత్తూ యుక్తవయస్సుకు వచ్చిన దుర్గ కూడా మరణిస్తుంది. ఇల్లు పాడుపడిపోతుంది, ఇలాంటి స్థితిగతుల మధ్య పల్లెటూళ్ళో జీవించలేక హరిహరరాయ్, సర్బజయ, అపు కలకత్తా వలస వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది.[1]

సిబ్బంది[మార్చు]

నటీనటులు[మార్చు]

  • హరిహరరాయ్ గా కానూ బెనర్జీ
  • సర్బజయ రాయ్ గా కరుణ బెనర్జీ
  • అపూర్బ రాయ్ (అపు) గా సుబీర్ బెనర్జీ
  • దుర్గా రాయ్ (చిన్నతనం) గా రుంకీ బెనర్జీ
  • దుర్గా రాయ్ (యుక్తవయసు) గా ఉమా దేశ్ గుప్తా
  • ఇందిర్ ఠాకూర్న్ గా చునిబాలా దేవి
  • పాఠశాల మాస్టారు ప్రసన్నగా తులసీ చక్రబొర్తి

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • దర్శకుడు - సత్యజిత్ రే
  • నిర్మాత - పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
  • నేపథ్య సంగీతం - రవి శంకర్
  • ఛాయాగ్రాహకుడు - సుబ్రతా మిత్రా
  • కూర్పు - దులాల్ దత్తా

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

1928లో బిభూతిభూషణ్ బందోపాధ్యాయ్ రాసిన పథేర్ పాంచాలి నవల ఎప్పుడు ప్రజాదరణ కోల్పోతే అప్పుడే ఆపివేసే షరతు మీద పత్రికలో ప్రచురితమై మంచి పాఠకాదరణ పొందింది. తర్వాతి సంవత్సరమే ప్రచురితమై, బెంగాలీ సాహిత్యంలో నిలిచిపోయిన పాత్రగా అపు, నవలగా పథేర్ పాంచాలి నిలిచాయి. 1940ల్లో శాంతినికేతన్‌లో లలిత కళల్లో చదువుకుని బయటకి వచ్చి కథకుడు, చిత్రకారుడు సత్యజిత్ రే భారతీయ సినిమాల్లో ప్రేమ పాటలు, మార్మిక పురాణాలు తప్ప జనజీవితం స్ఫూర్తినివ్వకపోవడంపై చాలా అసంతృప్తి కలిగివుండేవారు. అందుకే బెంగాలీ గ్రామీణ జీవిత వాస్తవాన్ని, వారి ఆశల్ని, కలల్ని ప్రతిబింబించిన పథేర్ పాంచాలి నవలను సినిమాగా మలిచారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 విష్ణుభొట్ల, లక్ష్మన్న (నవంబరు 2008). "రహదారి పాట - `పథేర్ పాంచాలి' సత్యజిత్ రాయ్ సినిమా". ఈమాట. Retrieved 8 April 2016.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు