చుర్రియో జబల్ దుర్గా మాత ఆలయం
చుర్రియో జబల్ దుర్గా మాత ఆలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 24°24′01.5″N 71°03′53.0″E / 24.400417°N 71.064722°E |
దేశం | పాకిస్థాన్ |
రాష్ట్రం | సింధ్ |
జిల్లా | తర్పర్కర్ |
ప్రదేశం | నాగర్పర్కార్ |
సంస్కృతి | |
దైవం | దుర్గా మాత |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | హిందూ దేవాలయాలు |
చుర్రియో జబల్ దుర్గా మాత ఆలయం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గల థార్‌పార్కర్ జిల్లాలోని నంగర్‌పార్కర్‌లో ఉన్న చుర్రియో అనే కొండపై ఉంది. ఇది ఒక చారిత్రాత్మక దేవాలయం. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు దాదాపు రెండు లక్షల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. హిందువులు ఈ ఆలయంలోని పవిత్ర జలంలో తమ పూర్వీకుల ఆత్మ శాంతించుటకు బూడిదను తెచ్చి కలుపుతుంటారు. ఆలయానికి సమీపంలో ఉన్న అత్యధిక విలువ కలిగిన గ్రానైట్ కొండ అధిక సంఖ్యలో తవ్వకాలకు గురౌతుంది, ఇది ఆలయానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది.[1][2]
వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]చుర్రియో (చోర్యో) అనే పేరు సింధీ భాష నుండి వచ్చిన పదం, ఇది 'چوڙي' నుండి ఉద్భవించింది, దీనిని 'చూ-ర్రీ' అని ఉచ్ఛరిస్తారు, అంటే 'కంకణం' అని అర్థం. ఆ విధంగా చుర్రియో అనే పదం సింధీ భాషలో గాజులు అనే పదానికి సంబంధించినది. ఎందుకంటే కొండకు సమీపంలో అనేక చిన్న గ్రామాలు చారిత్రాత్మకంగా గాజుల తయారీ వృత్తికి అనుబంధంగా ఉన్నాయి. స్థానికంగా తయారు చేయబడిన ఈ గాజులు గ్రామాల నుండి పశ్చిమాన మితి, ఉత్తరాన ఉమర్‌కోట్ వరకు ఉన్న నంగర్‌పార్కర్ వంటి సమీప పట్టణాలకు రవాణా చేయబడతాయి. దీని ప్రకారం, సాంస్కృతికంగా, ఆ ప్రాంతంలోని మహిళలు తమ మణికట్టును అలంకరించే గాజులతో భారీగా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులను ధరిస్తారు. అందుకే ఈ ప్రాంతానికి చుర్రియో అనే పదం ఏర్పడింది.[3]
ప్రాముఖ్యత
[మార్చు]చోరియో గ్రామంలోని చుర్రియో జబల్ కొండపై ఉన్న ఆలయం, దుర్గా దేవికి అంకితం చేయబడింది. దుర్గా మాతను చెడును నాశనం చేసి, చెడుపై మంచి విజయంగా, విశ్వానికి తల్లిగా, సృష్టికి సంరక్షణగా, శక్తి రూపంగా భావిస్తారు. పాకిస్తాన్ నుండి, ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ల నుండి మాత్రమే కాకుండా, నేపాల్, భారతదేశం, ఇతర దేశాల నుండి కూడా వేలాది మంది యాత్రికులు పండుగల సమయంలో చుర్రియో కొండను సందర్శిస్తారు. ఈ ఆలయం పాకిస్తాన్‌లోని సింధ్‌లో హిందూ సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగం. శివరాత్రి నాడు దాదాపు రెండులక్షల మంది యాత్రికులు ఈ ఆలయాలను సందర్శిస్తారు. హిందువులు చనిపోయినవారిని ఇక్కడే దహనం చేస్తారు. పవిత్ర జలంలో ముంచడం కోసం శివరాత్రి వరకు బూడిదను భద్రపరుస్తారు. ధనిక పాకిస్తానీ హిందువులు బూడిదను గంగలో నిమజ్జనం చేయడానికి భారతదేశానికి వెళతారు, మిగిలిన వారు బూడిదను నిమజ్జనం చేయడానికి నగర్‌పార్కర్‌ను సందర్శిస్తారు. అయితే దేవాలయాలు ఉన్న కొండలను డైనమైట్ బ్లాస్టింగ్ ద్వారా మైనింగ్ కోసం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకుంది. దీంతో ఆలయాలకు ముప్పు వాటిల్లుతోంది. కొంతమంది దుష్కర మూకలు ఈ ప్రాంతాన్ని నాశనం చేయడంపై యాత్రికులు నిరసన చేపట్టారు.[4]
మైనింగ్
[మార్చు]ఆలయం ఉన్న చుర్రియో కొండ గ్రానైట్‌తో ఏర్పడింది. భారతదేశంలోని రాజ్‌పుతానా పొరుగు ప్రాంతాలతో పోలిస్తే, గ్రానైట్ బూడిద రంగులో , నిర్మాణం బహుళ వర్ణాలుగా ఉంటుంది అందువల్ల ఇది ఖరీదైనది.[5]
మైనింగ్ అనేది ఈ ప్రాంతంలోని హిందూ దేవాలయాలకు తీవ్ర ప్రమాదం కలిగిస్తోంది. ఈ మైనింగ్‌పై హిందూ సమాజం నిరసన వ్యక్తం చేసింది. స్థానిక హిందువులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, తవ్వకం పనులు ముందుకు సాగుతున్నాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Nagarparkar: The land of history and architectural marvels". 16 May 2019.
- ↑ "Contractor blasting through Tharparkar temple in search of granite". 9 March 2011.
- ↑ Agencies (25 September 2014). "Hindus celebrate Navratri and Durga Puja festival".
- ↑ Contractor blasting through Tharparkar temple in search of granite , The Express Tribune, 10 Mar 2011.
- ↑ "Demographic, Social & Economic Changes in Tharparkar" (PDF). Archived from the original (PDF) on 2011-06-01. Retrieved 2016-07-19.
- ↑ "UNPO: Sindh: Shrinking Space of Tolerance".