Coordinates: 33°02′06″N 75°16′34″E / 33.035°N 75.276°E / 33.035; 75.276

చెనాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెనాని
పట్టణం
చెనాని is located in Jammu and Kashmir
చెనాని
చెనాని
జమ్మూ కాశ్మీర్‌లో స్థానం
చెనాని is located in India
చెనాని
చెనాని
చెనాని (India)
Coordinates: 33°02′06″N 75°16′34″E / 33.035°N 75.276°E / 33.035; 75.276
దేశంభారతదేశం ( India)
రాష్ట్రంజమ్మూ కాశ్మీర్
జిల్లాఉధంపూర్ జిల్లా
తాలూకాచెనాని
Elevation
1,062 మీ (3,484 అ.)
Population
 (2011)
 • Total2,620
జనాభా
 • అక్షరాస్యత88.91%
 • లింగ నిష్పత్తి809 / 1000
భాషలు
 • అధికారిక భాషలు[1]డోగ్రి, ఇంగ్లీష్, హిందీ, కాశ్మీరి, ఉర్దూ
 • మాట్లాడే భాషడోగ్రీ భాష, హిందీ, కాశ్మీరి
Time zoneUTC+5:30 (IST)
PIN
182141
టెలిఫోన్ కోడ్01992
Vehicle registrationJK-14
డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్

చెనాని భారతదేశం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, ఉధంపూర్ జిల్లాలోని నగరం.[2] ఇది తావి నది ఒడ్డున ఉంది. 1947కి ముందు, ఈ ప్రాంతాన్ని చందేల్ రాజపుత్రులు పాలించారు. 9.28 కి.మీ పొడవుతో భారతదేశపు అతి పొడవైన (2017) రహదారి సొరంగం అయిన డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ (5.8 మైళ్ళు) ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. దీనిని చెనాని-నశ్రీ టన్నెల్ అని కూడా పిలుస్తారు.[3]

చరిత్ర[మార్చు]

1947 వరకు, చెనాని సంస్థానాన్ని చందేల్ రాజ్‌పుత్‌లు పరిపాలించారు,[4] వీరు 9వ శతాబ్దంలో హిమాచల్ ప్రదేశ్‌, బిలాస్‌పూర్ లోని కోట్ కల్హూర్ ప్రాంతం నుండి ఈ ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రాంతంలోని స్థానికులు బిలాస్‌పూర్‌కు చెందిన రాజా బీర్ చంద్‌ను సంప్రదించి స్థానిక రాణాల దురాగతాల నుండి వారిని రక్షించమని అభ్యర్థించారు. అపుడు రాజా బీర్ చంద్ తన తమ్ముడు అయిన రాజా గంభీర్ చంద్‌ని పంపాడు. అతను స్థానికులకు సహాయం చేయడానికి సైన్యంతో పాటు చెనాని చేరుకొని తర్వాత, రాణాలతో పోరాడి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. 1947 వరకు ఈ రాజపుత్ర వంశానికి చెందిన 52 మంది రాజులు ఈ రాచరిక రాష్ట్రాన్ని పాలించారు.

భౌగోళికం[మార్చు]

చెనాని, జమ్మూ నగరానికి ఈశాన్యంలో 90 కి.మీ దూరంలో 33.03°N అక్షాంశం, 75.28°E రేఖాంశం వద్ద ఉంది.[5] ఇది సముద్ర మట్టానికి  సగటున 1,062 మీటర్లు (3,487 అడుగులు) ఎత్తులో ఉంది. తావి నది చెనాని పట్టణం గుండా ప్రవహిస్తుంది. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపే ఎన్హెచ్ 1ఏ చెనాని గుండా వెళుతుంది. జమ్మూ నుండి బస్సులు చెనాని చేరుకోవడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఉదంపూర్ నుండి చెనానికి మినీ-బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. చెనానికి 25 కి.మీ దూరంలో ఉధంపూర్‌లోని రైల్వే స్టేషన్ ఉంది. చెనాని ప్రసిద్ధ సుధ్మహదేవ్, గౌరీకుండ్, మంటలై పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం, చెనానికి బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.[6]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[7] చెనాని పట్టణం జనాభా 2,620, ఇందులో 1,448 మంది పురుషులు, 1,172 మంది స్త్రీలు ఉన్నారు. చెనాని పట్టణంలో అక్షరాస్యత రేటు 88.91%, పురుషుల అక్షరాస్యత 94.43%, స్త్రీల అక్షరాస్యత 82.19%. జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు.[8]

రవాణా[మార్చు]

ఈ పట్టణానికి రోడ్డు రవాణా మాత్రమే ఉంది. కన్యాకుమారి - శ్రీనగర్‌ను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి చెనాని గుండా వెళుతుంది. డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ జమ్మూ-శ్రీనగర్ మార్గంలో హిమపాతంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా నడుస్తుంది. ఈ సొరంగం జమ్మూ, శ్రీనగర్ మధ్య హైవే పొడవును 31 కి.మీ మేర తగ్గిస్తుంది. ఇది పట్నిటాప్ వద్ద శీతాకాలంలో మంచు కురవడం, హిమపాతాల కారణంగా సంభవించిన ఎన్హెచ్ 44లో ట్రాఫిక్ జామ్‌లను కూడా తగ్గిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. Archived from the original on 24 September 2020. Retrieved 23 September 2020.
  2. "CHENANI | District Udhampur, Government of Jammu and Kashmir | India". Retrieved 2023-07-22.
  3. "Chenani-Nashri Tunnel (Patnitop Tunnel), Jammu and Kashmir, India". www.roadtraffic-technology.com. Retrieved 2023-07-22.
  4. "Municipality Chenani | District Udhampur, Government of Jammu and Kashmir | India". Retrieved 2023-07-22.
  5. Falling Rain Genomics, Inc - Chenani
  6. "Chenani Town". www.onefivenine.com. Retrieved 2023-07-22.
  7. "Chenani Municipal Committee City Population Census 2011-2023 | Jammu and Kashmir". www.census2011.co.in. Retrieved 2023-07-22.
  8. "Udhampur district census 2011" (PDF). Govt of India Census. Retrieved 14 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=చెనాని&oldid=3938860" నుండి వెలికితీశారు