చెరుకుపల్లి జమదగ్నిశర్మ

వికీపీడియా నుండి
(చెఱుకుపల్లి జమదగ్నిశర్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చెరుకుపల్లి జమదగ్నిశర్మ
జననం1920
మరణం1986
శ్రీకాళహస్తి
ప్రసిద్ధిఅధ్యాపకుడు,
కథారచయిత,
కవి
భార్య / భర్తశేషమణి
తండ్రిచెరుకుపల్లి బుచ్చిరామేశ్వరశర్మ
తల్లిలక్ష్మీనరసమ్మ

చెరుకుపల్లి జమదగ్నిశర్మ ఆంధ్రదేశములోని విద్వద్వరేణ్యులలో ఎన్నదగినవాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

చెరుకుపల్లి జమదగ్నిశర్మ చెరుకుపల్లి బుచ్చిరామేశ్వరశర్మ, లక్ష్మీనరసమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో అయిదవవాడిగా 1920లో జన్మించాడు. ఇతడు తన అన్నగారు న్యాయవాది అయిన వెంకటప్పయ్య పెంపకంలో పెరిగాడు. ఇతడు లంకా నరసింహశాస్త్రి వద్ద ప్రాచీన గురుకుల పద్ధతిలో వేదవిద్యను అభ్యసించాడు.విశ్వనాథ సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం, భూపతి లక్ష్మీనారాయణరావులు ఇతని సాహిత్య గురువులు. ఇతడు అనంతపురము, రాజమండ్రి, కడప, విజయవాడ, శ్రీకాళహస్తి మొదలైన ప్రాంతాలలో ప్రభుత్వకళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. ఉద్యోగ విరమణానంతరం శ్రీకాళహస్తిలో నివసిస్తూ అక్కడ పురాణ ప్రవచనాలు చేసేవాడు. ఇతడు 1986లో మరణించాడు.[1]

రచనలు

[మార్చు]
  1. మహోదయం (గేయరూపకం)
  2. చిలకా గోరింక
  3. మరపురాని ఆ ఊరు
  4. ప్రతిఫలం
  5. గొల్ల హంపన్న
  6. అన్నదమ్ములు (కథా సంపుటం)
  7. జమదగ్ని కథలు (కథా సంపుటం)
  8. ఆంతర్యము
  9. ధర్మదీక్ష
  10. కల్పవృక్ష కావ్యానుశీలనము
  11. వైరభక్తి
  12. త్రిశతి
  13. శ్రీమద్దక్షిణ కైలాసగిరి ప్రదక్షిణ మహాకావ్యము
  14. శ్రీరామరాజ్యము

మూలాలు

[మార్చు]
  1. బి.నారాయణరెడ్డి (31 December 1991). జమదగ్ని త్రిశతి అనుశీలనము - పరిశోధన గ్రంథం (PDF). p. 1వ అధ్యాయం - జమదగ్ని రూపురేఖలు. Retrieved 18 January 2020.