Jump to content

చెలమెల వాగు ప్రాజెక్టు

వికీపీడియా నుండి

చెలమెల వాగు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఇర్కేపల్లి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి ఉపనది అయిన చెలమల వాగు పై నిర్మించబడిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు[1].దినినే ఎన్టీఆర్ సాగర్ అని కూడా అంటారు.ఈ ప్రాజెక్టు ఆసిఫాబాద్ కు 40 కి.మీ దూరం లోను, తిర్యానికి 4 కి.మీ దూరంలో ఉంది.25 సెప్టెంబరు 1988లో నిర్మిణమునకు శంకుస్థాపన చేసినప్పటికి పునః 1999లో ప్రారంభించబడింది[2].

చెలమెల వాగు ప్రాజెక్టు
అధికార నామంఎన్టీ ఆర్ సాగర్ ప్రాజెక్ట్
Chelamela Vagu Project
ప్రదేశంఇర్కపల్లి గ్రామం, తిర్యాని మండలం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా,తెలంగాణ,ఇండియా
ప్రారంభ తేదీ1999
నిర్మాణ వ్యయం27.99 లక్షల కోట్లులో పూర్తి
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుచెలమెల వాగు (నది)
Height18 మీటర్లు (59 అడుగులు)
పొడవు6,000మీటర్లు (3,320 అడుగులు)
జలాశయం
సృష్టించేదిచలమెల జలాశయం
మొత్తం సామర్థ్యం10.49 cam
పరీవాహక ప్రాంతం39.7sqMi

చరిత్ర

[మార్చు]

చెలమెల వాగు ప్రాజెక్టు [3] పురాతనమైన ప్రాజెక్టు తిర్యాని మండలంలోని చెలమెల వాగు పై నిర్మించబడిన మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు[4] తిర్యాణి మండలంలోని 16 గ్రామముల క్రింద ఆరువేల ఎకరములకు నీరందించు నిమిత్తము 22 కోట్ల 99 లక్షల రూపాయిల వ్యయముతో నిర్మించబడినది. ఈ డ్యామ్ పొడవు 340 మీటర్లు కల్గి కుడి కాలువ 9.00 కి.మీటర్లు,ఎడమ కాలువ 6.60 కి.మీటర్లు ఉన్నాయి.ఈ ప్రాజెక్టు నిర్మాణమునానికి ₹=27.17 అక్షరాల ఇరువై ఏడు కోట్ల వ్యయమను అంచనా వేసి 2529 హేక్టార్ భూమిని నీరు అందించే ఉద్దేశ్యంతో నిర్మింపబడింది.ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఇర్కపల్లి గ్రామమంలో ఈ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది.103 చదరపు మైళ్ళ వైశాల్యం 10.495 నీరు నిలువ ఉండే సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు ఎత్తు 340 మీటర్లు నిడివి గల ఆనకట్ట నిర్మించబడినది. అడుగు మట్టం 1262 రిజర్వాయరు నిటీ మట్టం 326 అడుగులు న్నాయి.చెలమెల వాగు ప్రాజెక్టు కాలువ వలన 16 గ్రామాలు లాభాలు పొందుతున్నారు[5].

మూలాలు

[మార్చు]
  1. Ravi (2023-01-18). "ఏజెన్సీ సంక్షేమ సారథి ఎన్టీఆర్". Disha daily (దిశ) | Breaking news (in ఇంగ్లీష్). Retrieved 2024-09-01.
  2. ABN (2022-11-15). "ఎన్టీఆర్‌ సాగర్‌లో చేప పిల్లల విడుదల". Andhrajyothy Telugu News. Retrieved 2024-09-01.
  3. "Kumuram Bheem Asifabad District Geographical Features: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భౌగోళిక విశేషాలు." Sakshi Education. Retrieved 2024-09-02.
  4. Velugu, V6 (2024-01-26). "బిట్​ బ్యాంక్​..నీటిపారుదల ప్రాజెక్టులు". V6 Velugu. Retrieved 2024-09-02. {{cite web}}: zero width space character in |title= at position 5 (help)CS1 maint: numeric names: authors list (link)
  5. telugu, NT News (2023-12-14). "ప్రాజెక్టులు నిండుగా..యాసంగికి పండుగ". www.ntnews.com. Retrieved 2024-09-02.