చెలియలి కట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవల ముఖచిత్రం

విశ్వనాథ సత్యనారాయణ 1935లో వ్రాసిన నవల. చలం వ్రాసిన మైదానం నవలను ఖండిస్తూ రాసిన నవలగా ఇది తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. మొట్టమొదట ఇది ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆపైన దాదాపుగా 12 ముద్రణలు పొంది ప్రాచుర్యమైనది.

నవల నేపథ్యం

[మార్చు]

చలం స్త్రీ స్వేచ్ఛకు అనుకూలంగా, సమాజం వ్యక్తుల జీవితాలపై చేసే కట్టుబాట్లకు వ్యతిరేకంగా రాసిన నవల మైదానం చాలా సంచలనం సృష్టించింది. మైదానం నవలను చలం 1925లో రాశారు. ఆ నవలలో భావాలు విశృంఖలతకు దారితీస్తాయంటూ కొందరు సంప్రదాయానుకూలురు ఆక్షేపించారు. అయితే కట్టుబాటు లేని స్వేచ్ఛ ప్రమాదకరమని అది వ్యక్తినీ, సంఘాన్నీ పతనం వైపుకు నడిపిస్తుందని విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ఈ చెలియలి కట్ట నవల మైదానాన్ని ఖండిస్తూ రాసిందనే భావిస్తూంటారు. మైదానం వెలువడ్డ పది సంవత్సరాలకు విశ్వనాథ సత్యనారాయణ చెలియలికట్ట వెలుగుచూసింది.
నవలను విశ్వనాథ సత్యనారాయణ 1935లో రచించారు. దీన్ని ఆయన ఆశువుగా చెప్తూండగా విశ్వనాథ సత్యనారాయణ పెద్ద అల్లుడు గుంటూరు సుబ్బారావు లిపిబద్ధం చేశారు. ఆపైన 1935లోనే ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడి సంచలనం సృష్టించింది. తర్వాత పుస్తకరూపంలో ప్రచురితమై 2015 వరకూ దాదాపుగా 12 ముద్రణలు పొందింది.

ఇతివృత్తం

[మార్చు]

ప్రభావాలు

[మార్చు]

నవలను విశ్వనాథ సత్యనారాయణ చలం రాసిన మైదానం నవలకు వ్యతిరేకంగా వ్రాశారని పలువురు పేర్కొన్నారు. మైదానం నవలలో అమీర్-రాజేశ్వరి జంటలాగానే రత్నావళి-రంగడు జంటను ఏర్పరిచి వారి ద్వారా చివరకు మైదానంలో ప్రతిపాదించిన విలువలు మన సమాజానికి పనికిరావని చెప్పించారంటూ సాహిత్య విమర్శకులు భావించారు.[1] పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే నవలలో తనకన్నా తక్కువ జ్ఞానం ఉన్నవారిని తమ వాక్చాతుర్యంతో తన మార్గానికి ఒప్పించి, తన మార్గానికి మళ్లించి, చివరికి ఆ వ్యక్తి జీవితం భ్రష్టమైనాకా తన అసహాయతను ప్రకటించడమనే కథాసంవిధానాన్ని కొంతవరకూ ఈ నవలకు విశ్వనాథ అనుసరించివుంటారని పోలాప్రగడ సత్యనారాయణమూర్తి భావించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. జయ, ప్రభ (1 జూలై 1999). "మైదానానికి చెలియలి కట్ట". ఈమాట. Archived from the original on 2015-05-07. Retrieved 17 April 2015.
  2. పోలాప్రగడ, సత్యనారాయణమూర్తి (3 సెప్టెంబరు 1993). జి.వి.ఎస్., సుబ్రహ్మణ్యం (ed.). విశ్వనాథ సాహితీ సమాలోచనం (1 ed.). హైదరాబాద్: యువభారతి. p. 59.

బయటి లంకెలు

[మార్చు]