చేనేత జీన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేనేత జీన్స్
జీన్స్ నేస్తున్న చేనేత కార్మికుడు
ప్రాంతంకమాలాపూర్, కమలాపూర్ మండలం, హన్మకొండ జిల్లా, తెలంగాణ
దేశంభారతదేశం
నమోదైంది2021


చేనేత జీన్స్ అనగా చేనేత మ‌గ్గాల‌పై తయారుచేసే జీన్స్ (క్లాత్).[1] తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలంలోని కమాలాపూర్ గ్రామంలో చేనేత మగ్గంపై ఈ జీన్స్ క్లాత్ ను తయారుచేస్తున్నారు.[2] మారుతున్న కాలానుగుణంగా కళాత్మకతతో, మేధాశక్తితో విభిన్న రకాల డిజైన్ల రూపొందిస్తున్న చేనేత కార్మికులు యువత అభిరుచులకనుగుణంగా జీన్స్‌ దుస్తులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

రూపకల్పన[మార్చు]

1950లో కమ‌లాపూర్ చేనేత ప‌రిశ్ర‌మ‌ల స‌హ‌కార సంఘం ఏర్పాటయింది. జీన్స్ ధ‌రించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాము జీన్స్ క్లాత్ ను తయారుచేస్తే ఎక్కువ ఆదాయం పొందవచ్చనుకున్న కార్మికులు డీఈఓను సంప్రదించగా, రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి వైవిధ్యాన్ని (ప్రోడక్ట్‌ డైవర్సిఫికేషన్‌) ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిపుణులతో శిక్షణను ఇప్పించారు. నిజాం కాలంలో సంపన్న కుటుంబీకులు ధరించే హిమ్రూ నమూనా దుస్తులు, చీరలు నేసి పురస్కారాలు అందుకున్న కమలాపూర్‌ చేనేత కార్మికులు జీన్స్‌ క్లాత్ నేయడం నేర్చుకున్నారు.[3]

ఉపాధి[మార్చు]

మూడువేల చేనేత మ‌గ్గాలు ఉన్న ఈ సంఘంలో దాదాపు 500 మంది ఈ జీన్స్ క్లాత్ తయారీలో ప‌నిచేస్తున్నారు. గ‌తంలో టెస్కో ఆర్డ‌ర్ ల‌పైనే ఆధార‌ప‌డ్డ ఈ సంఘం, జీన్స్ నేయ‌డం ప్రారంభించిన త‌ర‌వాత ఎక్కువ ఆర్డ‌ర్లు వస్తున్నాయి. వ్యాపారం పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది.[4]

మూలాలు[మార్చు]

  1. "చేనేత మగ్గంపై రాచరికపు హంగులు". andhrajyothy. Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-23.
  2. "తెలంగాణ‌లోనే తొలిసారిగా చేనేత మ‌గ్గాల‌పై జీన్స్ త‌యారీ." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-20. Archived from the original on 2021-11-20. Retrieved 2021-11-23.
  3. "CHENETHA JEANS: చేనేత జీన్స్‌.. విభిన్న రకాల డిజైన్లు రూపొందిస్తున్న నేతన్నలు". ETV Bharat News. 2021-10-28. Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-23.
  4. "తెలంగాణ మ‌గ్గంపై రంగుల‌ద్దుకుంటున్న‌ "హ్యాండ్ మేడ్ జీన్స్"...!". Manam News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-18. Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-23.