చైనా సెంట్రల్ టెలివిజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైనా సెంట్రల్ టెలివిజన్ పాత భవనం.

చైనా సెంట్రల్ టెలివిజన్(CCTV) అనేది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CCP)చే నియంత్రించబడే చైనీస్ ప్రభుత్వరంగ బ్రాడ్‌కాస్టర్. CCTV వివిధ కార్యక్రమాలను ప్రసారం చేసే 50 ఛానెల్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఆరు వేర్వేరు భాషల్లో ఒక బిలియన్ కంటే ఎక్కువ వీక్షకులకు అందుబాటులో ఉంది.[1]  దాని కార్యక్రమాలలో చాలా వరకు వార్తలు, డాక్యుమెంటరీ, సామాజిక విద్య, హాస్యం, వినోదం, నాటకం మిశ్రమంగా ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం చైనీస్ సోప్ ఒపెరాలు, వినోదాలను కలిగి ఉంటాయి.[2]  చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సున్నితమైన అంశాలకు సంబంధించిన వార్తలు నిషేదం. తరచుగా ఆ పార్టీ శత్రువులపై ఇది ఆయుధంగా ఉపయోగించబడుతుంది.[3][4] CCTVని నేషనల్ రేడియో, టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. ఇది నేరుగా CCP ప్రచార విభాగానికి నివేదిస్తుంది.[5][6]

1 మే 1958న ప్రభుత్వ యాజమాన్యంలోని న్యూస్, పబ్లిక్ ఒపీనియన్ స్టీరింగ్ ఏజెన్సీగా, CCP మౌత్ పీస్‌గా పని చేయడానికి CCTV స్థాపించబడింది. CCTV వార్తల కమ్యూనికేషన్, సామాజిక విద్య, సంస్కృతి, వినోద సమాచార సేవలు వంటి అనేక రకాల విధులను నిర్వర్తిస్తుంది. రాష్ట్ర టెలివిజన్ స్టేషన్‌గా ఇది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ కౌన్సిల్ రెండింటికీ బాధ్యత వహిస్తుంది.[7]  ఇది చైనా ప్రభుత్వ ప్రచార నెట్‌వర్క్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.[3]

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Olympics Are Ratings Bonanza for Chinese TV". The New York Times. 22 August 2008. Archived from the original on 20 December 2016. Retrieved 1 September 2016.
  2. Anne-Marie Brady, Marketing Dictatorship: Propaganda and Thought Work in Contemporary China, Rowman & Littlefield Publishers, Inc.
  3. 3.0 3.1 Cook, Sarah (25 September 2019). "China Central Television: A Long-standing Weapon in Beijing's Arsenal of Repression". Freedom House. Retrieved 15 November 2020.
  4. Lim, Louisa; Bergin, Julia (2018-12-07). "Inside China's audacious global propaganda campaign". The Guardian. Retrieved 2021-05-19.
  5. Pan, Jennifer; Shao, Zijie; Xu, Yiqing (2021). "How government-controlled media shifts policy attitudes through framing". Political Science Research and Methods (in ఇంగ్లీష్): 1–16. doi:10.1017/psrm.2021.35. ISSN 2049-8470. S2CID 243422723.
  6. Buckley, Chris (2018-03-21). "China Gives Communist Party More Control Over Policy and Media". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2021-11-12.
  7. Ying Zhu (4 May 2010). Two Billion Eyes: The Story of China Central Television. New Press. ISBN 978-1-59558-802-9. Archived from the original on 24 December 2019. Retrieved 8 October 2019.