చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ
Appearance
చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) అనేది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) ను స్థాపించి, దానిని ఏలుతున్న ఏకైక పార్టీ. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ అప్పటిదాకా అధికారంలో ఉన్న క్యోమింటాంగ్ ప్రభుత్వాన్ని చైనా అంతర్యుద్ధం ద్వారా గద్దె దింపింది. 1949లో మావో జెడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రపంచానికి చాటించాడు. అప్పటి నుంచి ఈ పార్టీనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సాయంతో చైనాను పరిపాలిస్తూ ఉంది. 2023 నాటికి ఈ పార్టీలో సుమారు పది కోట్ల మంది సభ్యులు ఉన్నాయి. ఇది ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ తర్వాత రెండవ అత్యంత పెద్ద రాజకీయ పక్షం.
అక్టోబర్ విప్లవం, మార్క్సిస్టు సిద్ధాంతాలు ఈ పార్టీ ఏర్పడటానికి మూలకారణం.[1]: 114
మూలాలు
[మార్చు]- ↑ Hunt, Michael (2013). The World Transformed: 1945 to the Present. Oxford University Press. ISBN 978-0312245832.