Jump to content

చైనీస్ డ్రాగన్

వికీపీడియా నుండి
చైనీస్ డ్రాగన్
Groupingపౌరాణిక జీవి
Sub groupingడ్రాగన్
Countryచైనా

చైనీస్ డ్రాగన్ - దీన్ని లూంగ్, లాంగ్, లంగ్ అని కూడా పిలుస్తారు. ఇది చైనీస్ పురాణాలు, చైనీస్ జానపద కథలు, చైనీస్ సంస్కృతిలో ఒక పురాణ జీవి. చైనీస్ డ్రాగన్‌లు తాబేళ్లు, చేపల వంటి అనేక జంతువులను పోలి ఉంటాయి. సాధారణంగా చైనీస్ డ్రాగన్ నాలుగు కాళ్లతో పాములాగా చిత్రీకరించబడుతుంది. చైనీస్ డ్రాగన్ మూలం పాములు, చైనీస్ ఎలిగేటర్లు, ఉరుములు, ప్రకృతి ఆరాధన.. ఇలా నాలుగు సిద్ధాంతాలను విద్యావేత్తలు గుర్తించారు. వారు దీన్ని సాంప్రదాయబద్దంగా శుభ సూచకంగా భావిస్తారు. ముఖ్యంగా వర్షపాతం, వరదలు, తుఫానులపై నియంత్రణకు చైనీస్ డ్రాగన్ ను నమ్ముతారు.[1] తూర్పు ఆసియాలో యోగ్యమైన వ్యక్తులను డ్రాగన్ శక్తి అని వ్యవహరించడమే కాక అదృష్టానికి చిహ్నంగా విశ్వసిస్తారు.[2] ఇంపీరియల్ చైనా కాలంలో, చైనా చక్రవర్తి డ్రాగన్‌ని తన చిహ్నంగా ఉపయోగించాడు. అనేక చైనీస్ సామెతలు, ఆశీర్వాదాలు డ్రాగన్‌ తో ముడిపడి ఉంటాయి, ఉదాహరణకు "ఒకరి బిడ్డ డ్రాగన్‌గా మారుతుందని ఆశిస్తున్నాను" (సరళీకృత చైనీస్: 望子成龙; సాంప్రదాయ చైనీస్: 望子成龍), , "డ్రాగన్‌లు, పాములు కలిసిపోయాయి - మంచి చెడు వ్యక్తులు కలసిపోయారు". డ్రాగన్ల చిత్రాల చైనీస్ సంస్కృతి కొరియా, వియత్నాం, జపాన్ వంటి అనేక ఆసియా దేశాలలో విస్తరించింది. డ్రాగన్ టోటెమ్‌ను జాతీయ చిహ్నంగా ఉపయోగించడం చైనీస్ సంప్రదాయం.

మూలాలు

[మార్చు]
  1. Meccarelli, Marco (2021). "Discovering the Long : Current Theories and Trends in Research on the Chinese Dragon". Frontiers of History in China. 16 (1): 123–142. doi:10.3868/s020-010-021-0006-6 (inactive 31 October 2021). ISSN 1673-3401. Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 2 డిసెంబరు 2021.{{cite journal}}: CS1 maint: DOI inactive as of అక్టోబరు 2021 (link)
  2. Ingersoll, Ernest; et al. (2013). The Illustrated Book of Dragons and Dragon Lore. Chiang Mai: Cognoscenti Books.[నమ్మదగని మూలం?]