రాగులు

వికీపీడియా నుండి
(చోళ్ళు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


రాగులు
మిశ్రమవర్ణాలలో ఉండే రాగులు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
ఎల్యుసీన్
Species:
ఇ. కొరకానా
Binomial name
ఎల్యుసీన్ కొరకానా
Eleusine coracana

రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానా, అమ్హరిక్లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథియోపియాలోని ఎత్తుప్రదేశాలు. అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశపెట్టబడినది[1]. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవడే పంట. హిమాలయాల పర్వతసానువుల్లో 2300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారు. రాగులును చోళ్ళు అని, తైదలనీ కూడా అంటారు.

సాగుచేసే విధానం[మార్చు]

రాగులను సాధారణంగా వేరుశెనగ, కంది, మినుము వంటి పప్పుదినుసులతో పాటు అంతర పంటగా సాగుచేస్తారు. రాగి సాగు యొక్క గణాంకాలు ఇతర చిరుధాన్యాలతో ముఖ్యంగా జొన్నలతో కలిపివేసి గందరగోళం ఏర్పడినా ప్రపంచవ్యాప్తముగా రాగిని దాదాపు 38 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారని అంచనా.

నిలువ[మార్చు]

కోతకోసిన తర్వాత ఈ ధాన్యము చాలా బాగా నిలువవుంటాయి. కీటకాలు, చీడపీడల సమస్య చాలా తక్కువ. ఎక్కువ కాలము నిలువవుండగల ఈ సామర్ధ్యమే రాగిని నిరుపేద వ్యవసాయ సముదాయాలకు రిస్కు నివారించే ప్రణాళికలో భాగం చేస్తుంది.

పోషక విలువలు[మార్చు]

ప్రపంచములో పెండలం, కూర అరటి, మిల్లు బియ్యం లేదా జొన్న ప్రధాన ఆహారముగా ఉపయోగించే కోట్లాది పేదప్రజల ఆహారములలో లోపించిన మిథియోనైన్ అమీనో ఆమ్లం రాగిలో పుష్కలంగా ఉండటం దీనికి ప్రాధాన్యాన్నిస్తుంది. రాగులను దంచి కేకులు, పుడ్డింగులు, పారిట్జులు వండవచ్చు.

లాభాలు[మార్చు]

స్వంత కృతి/రాగులు/తైదులు
  • అధిక బరువు తగ్గటానికి: రాగుల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి. ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే.
  • ఎముక పుష్టికి: వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి.
  • మధుమేహం నియంత్రణకు: రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.
  • కొలెస్ట్రాల్ తగ్గేందుకు: లెసిథిన్, మెథియోనైన్ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.
  • రక్తహీనత: రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.
  • ఆందోళన : వీటిల్లోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది.
  • కండరాల మరమ్మతుకు: ఐసోల్యూసిన్ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. వాలైన్ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది. కండరాలు సమన్వయంతో పనిచేయటానికి, శరీరంలో నైట్రోజన్ సమతుల్యతకు తోడ్పడుతుంది.
  • వృద్ధాప్యం దూరంగా: రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.

రాగుల మొలకెత్తించిన పిండిని ఉదయం మజ్జిగతో గాని బెల్లంతో గాని తీసుకొంటే అద్భుతమైన పోషకాలు పొందవచ్చు

మూలాలు[మార్చు]

  1. A.C. D'Andrea, D.E. Lyons, Mitiku Haile, E.A. Butler, "Ethnoarchaeological Approaches to the Study of Prehistoric Agriculture in the Ethiopian Highlands" in Van der Veen, ed., The Exploitation of Plant Resources in Ancient Africa. Kluwer Academic: Plenum Publishers, New York, 1999.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాగులు&oldid=4193414" నుండి వెలికితీశారు