జగమే మాయ బ్రతుకే మాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవదాసు 1953 సినిమా ప్రచార గోడపత్రిక

జగమే మాయ బ్రతుకే మాయ పాట 1953 లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించారు. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు హృద్యంగా గానం చేయగా సి.ఆర్. సుబ్బరామన్ సంగీతాన్ని అందించాడు. ఈ పాట వాస్తవానికి ఎం ఎస్ విశ్వనాథన్ స్వరపరిచాడు. అద్వైత భావాలతో కూడిన ఈ పాటను మల్లాది రామకృష్ణశాస్త్రి రచిందాడని మరో వాదన. ఒక సందర్భంలో సముద్రాల ఈ విధంగా తెలిపాడు. " వాస్తవం ఏమిటంటే, నేను ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నాను. నా వద్ద సమయం లేదు. రామకృష్ణ శాస్త్రి నాకు మంచి స్నేహితుడు. అతను ఆ పాటలు రాయడం ద్వారా నాకు సహాయం చేసాడు. ఆ పాటలకు తన పేరును క్రెడిట్ చేయమని ఆయన నన్ను ఎప్పుడూ అడగలేదు. ఆ విషయానికి, నా కొడుకు రామానుజచార్య (సముద్ర జూనియర్) కూడా నాకు మద్దతు ఇచ్చాడు. (సినిమా) పరిశ్రమలో ఒకరికొకరు సహాయపడటం ఒక సాధారణ పద్ధతి.”[1]

నేపథ్యం[మార్చు]

దేవదాసు పార్వతి చిన్ననాటి నుండి ప్రేమించుకుంటారు. లండన్ లో పైచదువుల తర్వాత తిరిగివచ్చిన దేవదాసు పార్వతిని పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. పెద్దల అంగీకారం లభించని కారణం వారు ప్రేమికులు గానే మిగిలిపోతారు. పార్వతిని మరచిపోలేని దేవదాసు మధ్యానికి బానిసై ఆరోగ్యాన్ని పాడుచేకుంటాడు. అలాంటి మానసిక పరిస్థితిలో జీవితం మీద వైరాగ్యంతో తత్వాల్ని జీవిత సత్యాల్ని రంగరించి విషాదంగా ఆలపిస్తాడు.

పాట లో కొంత భాగం[మార్చు]

పల్లవి:

జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా ||| జగమే మాయ |||

చరణం 1:

కలిమీలేములు కష్టసుఖాలు

కావడిలో కుండలనీ భయమేలోయి

కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్

కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి ||| కావడి కొయ్యేనోయ్ ||| ||| జగమే మాయ |||

ఇతర విషయాలు[మార్చు]

  • సమాజంలో ప్రేమలో విఫలమైనవారు, చాల మంది మందు బాబులు, బంధాల్లో బలిఅయిపోయినవారు ఇప్పటికి పాడుకునే పాట ఇది.[2]
  • ఈ సినిమా పల్లవితో సంసారం ఒక చదరంగం సినిమాలో మరోపాట ఉంది. దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఈ పాటను వేటూరి సుందరరామమూర్తి రచించగా, చక్రవర్తి సంగీతాన్నందించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Narasimham, M. L. (2017-12-25). "Devadasu: Of Atman and Brahman". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-03-29.
  2. arun (2018-11-15). "..."జగమే మాయ బ్రతుకే మాయ"". www.hmtvlive.com. Retrieved 2021-03-29.
  3. "Jagame Maya Song : Samsaram Oka Chadarangam, Jagame Maya Song Lyrics, Music Director, Singers, Lyricists, Lyrical Videos". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-03-29.

బయటి లింకులు[మార్చు]