జపాన్‌లో హిందూమతం

![]() | |
![]() డాయ్‌షో ఇన్ ఆలయంలో బెంజైటెన్ (సరస్వతి), కంగిటెన్ (వినాయకుడు), బిష్మోంటెన్ (కుబేరుడు) ల విగ్రహాలు. | |
మొత్తం జనాభా | |
---|---|
55,000 (సుమారు.) | |
మతాలు | |
హిందూమతం |
హిందూ మతానికి బౌద్ధమతంతో దగ్గరి సంబంధం ఉంది. జపాన్‌లో ఇది మైనారిటీ మతం. అయినప్పటికీ, జపాన్ సంస్కృతిలో హిందూ మతం ముఖ్యమైన పాత్ర పోషించింది.
సాంస్కృతికంగా[మార్చు]
జపాన్‌లో హిందూ మతాన్ని పెద్దగా ఆచరించనప్పటికీ, జపాను సంస్కృతిలో దీనికి ముఖ్యమైన పాత్ర, కాకపోతే పరోక్ష పాత్ర ఉంది. 6వ శతాబ్దంలో చైనా నుండి కొరియన్ ద్వీపకల్పం ద్వారా అనేక బౌద్ధ విశ్వాసాలు, సంప్రదాయాలు (దీనికి హిందూమతానికీ మూలం భారతీయ మొక్కటే) జపాన్‌కు వ్యాపించడమే దీనికి కారణం. దీనికి ఒక సూచన - జపనీయుల "ఏడుగురు అదృష్ట దేవుళ్ళలో" నలుగురు హిందూ దేవతలే. వారు బెంజైటెన్సామా ( సరస్వతి), బిషమీన్(వైశ్రవసుడు లేదా కుబేరుడు), డాయ్‌కోకుటెన్ (మహాకాళుడు/శివుడు), కిచిజోటెన్ (లక్ష్మి). బెంజైటెన్న్యో (సరస్వతి), కిచిజోటెన్న్యో (లక్ష్మి) లతో పాటు హిందూమతం లోని త్రిదేవిలలో మూడవదేవిగా మహాకాళి ని డాయ్‌కోకుటెన్న్యో పేరుతో తీసుకున్నారు. అయితే ఆమె తన పురుష రూపమైన డైకోకుటెన్‌గా ఉన్నపుడే జపాన్ లోని ఏడుగురు అదృష్ట దేవతలలో ఒకరిగా పరిగణిస్తారు. [1]
బెంజైటెన్ జపాన్‌కు 6వ నుండి 8వ శతాబ్దాల మధ్య గోల్డెన్ లైట్ సూత్రపు చైనీస్ అనువాదాల ద్వారా వచ్చాడు. కమల సూత్రంలో కూడా ఆమె ప్రస్తావన ఉంది. జపాన్‌లో, లోకపాలులు నలుగురు స్వర్గపు రాజుల బౌద్ధ రూపాన్ని తీసుకుంటారు. గోల్డెన్ లైట్ సూత్రం జపాన్‌లోని అత్యంత ముఖ్యమైన సూత్రాలలో ఒకటిగా మారింది. దేశాన్ని సరైన పద్ధతిలో పరిపాలించే పాలకులను నలుగురు స్వర్గ పాలకులు రక్షిస్తారని దాని ప్రాథమిక సందేశం. హిండువుల మరణ దేవుడైన యముడు, బౌద్ధంలో ఎన్మా అని పిలుస్తారు. గరుత్మంతుని, కరురా అంటారు. ఇది జపాన్లోని అపారమైన, అగ్నిని వదిలే జీవి. ఇది మానవ శరీరంతో, డేగ ముక్కుతో ఉంటుంది. టెనిన్ అప్సరసల నుండి ఉద్భవించింది. టోక్యోలో, ఫుటాకో తమగావా లోని ఒక ఆలయంలో బుద్ధుడి కంటే వినాయకుడు ఎక్కువగా కనిపిస్తాడు. జపాన్‌పై హిందూ ప్రభావానికి ఇతర ఉదాహరణలు "ఆరు పాఠశాలలు" లేదా "ఆరు సిద్ధాంతాలు". అలాగే యోగా, పగోడాలను ఉపయోగించడం వంటివి. జపాన్‌ను ప్రభావితం చేసిన హిందూ సంస్కృతి లోని అనేక కోణాలు చైనా సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి.
హిందూ దేవుళ్ల ఆరాధనపై జపాన్‌లో పుస్తకాలు రాశారు. నేటికీ, హిందూ దేవుళ్ల గురించి లోతైన అధ్యయనాన్ని జపాన్ ప్రోత్సహిస్తుంది. [2]
వర్తమానంలో[మార్చు]
హిందూమతం ప్రధానంగా భారతీయ, నేపాలీ వలసదారులు ఆచరిస్తారు. అయితే ఇతరులు కూడా ఉన్నారు. 2016 నాటికి, జపాన్‌లో 30,048 మంది భారతీయులు, 80,038 మంది నేపాలీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు హిందువులే. హిందూ దేవుళ్లను ఇప్పటికీ చాలా మంది జపనీయులు ముఖ్యంగా షింగాన్ బౌద్ధమతంలో గౌరవిస్తారు. జపాన్‌లోని ఉన్న హిందూ దేవాలయాల్లో ముఖ్యమైనవి టోక్యో లోని శివ శక్తి ఆలయం & ఆశ్రమం , టోక్యో లోని షిర్డీ సాయిబాబా ఆలయం, ఇస్కాన్ న్యూ గయా, బెంజైటెన్సమా పుణ్యక్షేత్రం (సరస్వతి పుణ్యక్షేత్రం), అసకుసా లోని గణేశ దేవాలయం.
జనాభా వివరాలు[మార్చు]
అసోసియేషన్ ఆఫ్ రిలిజియన్ డేటా ఆర్కైవ్స్ ప్రకారం, 2015లో జపాన్‌లో 25,597 మంది హిందువులు ఉన్నారు [3]
మూలాలు[మార్చు]
- ↑ オーム (U+30AA & U+30FC & U+30E0)
- ↑ "Butsuzōzui (Illustrated Compendium of Buddhist Images)" (digital photos) (in Japanese). Ehime University Library. 1796. p. (059.jpg).
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Japan wants to encourage studies of Hindu gods"[dead link] Satyen Mohapatra Archived 2020-03-01 at the Wayback Machine
- ↑ "Japan, Religion And Social Profile". thearda.com.