జబల్పూర్ - రేవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | మధ్య ప్రదేశ్ (మహాకోషల్, బాఘేల్‌ఖండ్) |
తొలి సేవ | జబల్పూర్ - సాత్నా |
ఆఖరి సేవ | జబల్పూర్ - రేవా |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | జబల్పూర్ జంక్షన్ |
ఆగే స్టేషనులు | 7 |
గమ్యం | రేవా |
ప్రయాణ దూరం | 240 కి.మీ. (150 మై.) |
సగటు ప్రయాణ సమయం | 3 గంటలు (షుమారుగా) |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి చైర్ కార్, జనరల్ చైర్ కార్, నిబంధనలు లేని జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆటోర్యాక్ సదుపాయం | లేదు |
ఆహార సదుపాయాలు | అవును మంచి ఆహారం ఉంది కానీ ఏ పాంట్రీ కారు (చిన్నగది) లేదు |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | అవును. అందుబాటులో ఉంది |
ఇతర సదుపాయాలు | ఆర్ఓవెండింగ్ యంత్రాలు, చైర్ కార్ కమ్ స్లీపర్ కారు కోచ్లు, కావలసినన్ని సాధారణ కోచ్లు |
సాంకేతికత | |
వేగం | 70 km/h (43 mph) విరామములతో కలుపుకొని సరాసరి వేగం |
జబల్‌పూర్ - రేవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] తూర్పు మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను, రేవా రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,
సంఖ్య, నామకరణం
[మార్చు]- రైలు నంబరు: 11451 జబల్పూర్ - రేవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- రైలు నంబరు: 11452 రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అనగా భారతీయ రైల్వేలు లోని ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ యందు చైర్ కారు (కుర్చీ కారు) తరగతి సేవలు అందుబాటులో ఉంటాయి అని అర్థం సూచిస్తుంది.
జోను, డివిజను
[మార్చు]ఈ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 11451. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.
- విరామములు : 7
- ప్రయాణ సమయము : సుమారుగా గం. 2.55 ని.లు
- బయలుదేరు సమయము : గం. 17:05 ని.లు.
- చేరుకొను సమయము : గం. 20.00 ని.లు
- దూరము : సుమారుగా 189 కి.మీ.
- వేగము : సుమారుగా 64 కి.మీ./గంట
- తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : రైలు నంబరు: 11452 రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
రైలు సమాచారం
[మార్చు]ఈ రైలు ఎగువ, దిగువ ప్రతి మార్గం రోజువారీ నడుస్తుంది.
- రైలు సంఖ్య: 11451 జబల్పూర్ - రేవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ 17.05 గంటలకు జబల్పూర్ లో బయలుదేరి, అదే రోజు 20.00 గంటలకు రేవా చేరుతుంది.
- రైలు సంఖ్య: 11452 రేవా - జబల్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ 6.00 గంటలకు రేవా నుండి బయలుదేరి అదే రోజు, 10.25 గంటలకు జబల్పూర్ చేరుకుంటుంది.
రైలు మార్గము, విరామములు
[మార్చు]ఈ రైలు కాట్నీ జంక్షన్ ద్వారా వెళుతుంది . రైలు యొక్క ముఖ్యమైన విరామములు క్రింద విధంగా ఉన్నాయి:
- జబల్పూర్ జంక్షన్
- కాట్నీ జంక్షన్
- మైహర్
- సాత్నా
- రేవా
లోకోమోటివ్
[మార్చు]ఈ రైలు ఇటార్సీ షెడ్ యొక్క ఈటి డబ్ల్యుడిఎం3 డీజిల్ లోకోమోటివ్ ద్వారా నెట్టబడుతూ ఉంది.
కోచ్ మిశ్రమం
[మార్చు]ఈ రైలు 11 కోచ్‌లను కలిగి ఉంటుంది:
- 1 ఎసి చైర్ కార్
- 5 రిజర్వ్డ్ చైర్ కార్లు
- 5 రిజర్వేషన్ లేని చైర్ కార్