జమిలి నమ్మాళ్వారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమిలి నమ్మాళ్వారు
జననంజమిలి నమ్మాళ్వారు
(1902-06-24)1902 జూన్ 24
India గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రసిద్ధిప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు
మతంహిందూ

జమిలి నమ్మాళ్వారు బహుభాషావేత్తగా, పుస్తక ప్రచురణకర్తగా, పత్రికా సంపాదకుడిగా, రచయితగా ప్రసిద్ధుడు[1].

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు గుంటూరు అగ్రహారంలో 1902, జూన్ 24 న జన్మించాడు[2]. ఇతడికి తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో విశేషమైన ప్రవేశం ఉంది. వాసవి అనే పక్ష పత్రికను సుమారు 10 సంవత్సరాలు నడిపాడు. గుంటూరు పత్రిక పేరుతో ఒక ద్వైవార వార్తా పత్రికను సంపాదకత్వం వహించి నిర్వహించాడు. ఆశాజ్యోతి అనే మాసపత్రికను కూడా నడిపాడు. నమ్మాళ్వార్ ప్రచురణలు పేరుతో 64 గ్రంథాలను ప్రచురించాడు. గుంటూరు పట్టణంలోని అనేక ప్రజాహిత సంస్థలతో ఇతనికి సంబంధం ఉండేది. జిల్లా పత్రికా సంపాదకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉత్తమ గ్రంథమాల పేరుతో కొన్ని మంచి పుస్తకాలను ప్రచురించాడు. స్నేహము అనే ఖండకావ్య సంపుటిని రచించాడు.

ప్రచురణ కర్త

[మార్చు]

ఇతడు ప్రచురించిన కొన్ని పుస్తకాల జాబితా:

  1. సుప్రభాత సముచ్ఛయమ్‌ - బచ్చు సుబ్బరాయగుప్త[3]
  2. శ్రీ కన్యకా సుప్రభాతమ్‌ - జమిలి నమ్మాళ్వారు[4]
  3. కుసుమగుప్త - నాగశ్రీ

మూలాలు

[మార్చు]
  1. కథానిలయంలో ఆయన గుంటూరు పత్రిక సంపాదకునిగా వివరణ
  2. "గుంటూరు మండల సర్వస్వము - సంపాదకుడు: [[[[దరువూరి వీరయ్య]]]] -పేజీ 454". Archived from the original on 2016-03-05. Retrieved 2021-09-04. {{cite web}}: URL–wikilink conflict (help)
  3. అన్నమయ్య_గ్రంథాలయ_పుస్తకాల_జాబితా_-29 లో 11328 సంఖ్య గల పుస్తకం[permanent dead link]
  4. అన్నమయ్య_గ్రంథాలయ_పుస్తకాల_జాబితా_-29 లో 11329 సంఖ్య గల పుస్తకం[permanent dead link]