Jump to content

జమైకాలో హిందూమతం

వికీపీడియా నుండి

జమైకా (ఆంగ్లం: Jamaica) ఉత్తర అమెరికాలోని ఒక ద్వీప దేశం. ఇక్కడ హిందూమతం మైనారిటీ మతం. ప్రధానంగా ఇండో-జమైకన్లు హిందూమతాన్ని అనుసరిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, జమైకా జనాభాలో 0.07% మంది హిందూమతస్థులు ఉన్నారు.

జనాభా వివరాలు

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం జమైకాలో 1453 మంది హిందువులు ఉన్నారు.[1] ఇది 2011 జనాభా లెక్కల్లో 1836కి పెరిగింది.[2]

సంవత్సరం శాతం జనాభా
2001 0.06% 1453
2010 0.07% 1836

మందిరము

[మార్చు]

సనాతన హిందూ దేవాలయం జమైకా ప్రభుత్వం గుర్తించిన ఏకైక హిందూ దేవాలయం. దీనిని 1970ల మధ్యలో పండిట్ మునేశ్వర్ మరాగ్ నిర్మించారు. నేడు ఈ ప్రార్థనా స్థలంలో అన్ని ప్రధాన పండుగలు జరుపుకుంటారు.[3][4]

సమకాలీన స్థితి

[మార్చు]

జమైకా హిందువుల ప్రధాన సమస్య పూజారుల కొరత. 2017లో, జమైకాలోని ఏకైక హిందూ పూజారి ఐన నాథన్ పండిట్ అంతుతెలియని స్థితిలో హత్య చేయబడ్డాడు.[5] ప్రస్తుతం, జమైకాలో ఇద్దరు హిందూ పూజారులు ఉన్నారు, పండిత రామదర్ మరాగ్, కొత్తగా నియమితులైన పండిత లోచన్ నాథన్-శర్మ.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jamaica". U.S. Department of State (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-10-16.
  2. "Religion and the 2011 census". jamaica-gleaner.com (in ఇంగ్లీష్). Retrieved 2018-10-16."Religion and the 2011 census". jamaica-gleaner.com. Retrieved 2018-10-16.
  3. "Jamaica Gleaner : Pieces of the Past: Out Of Many Cultures: Roads and Resistance: RELIGIOUS ICONS part 2". old.jamaica-gleaner.com. Retrieved 2018-10-16.
  4. "Faith in Jamaica | Learn More About What We Believe". www.visitjamaica.com (in ఇంగ్లీష్). Retrieved 2018-10-16.
  5. "Priest killed at his Mandeville mansion". jamaica-star.com (in ఇంగ్లీష్). Retrieved 2018-10-16.