జయశ్రీ రైజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయశ్రీ రైజి
జయశ్రీ రైజి


పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ
పదవీ కాలం
1952-1962
నియోజకవర్గం బొంబాయి సబర్బన్

వ్యక్తిగత వివరాలు

జననం (1895-10-26)1895 అక్టోబరు 26
సూరత్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఎన్ఎం రైజి
సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

జయశ్రీ రైజి ( 1895 అక్టోబరు 26-1985) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. సామాజిక కార్యకర్త, సంస్కరణవాది, రాజకీయ నాయకురాలు. బొంబాయి సబర్బన్ స్థానం నుండి 1వ లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

తొలి జీవితం[మార్చు]

జయశ్రీ 1985, అక్టోబరు 26న సూరత్ లోని సర్ మనుభాయ్ మెహతాకు జన్మించింది. బరోడా కళాశాలలో ఉన్నత చదువులను చదివారు.[1]

ఉద్యమ జీవితం[మార్చు]

సామాజిక సేవలో పేరొందిన రైజి 1919లో బొంబాయి ప్రెసిడెన్సీ మహిళా కౌన్సిల్ చైర్‌పర్సన్ గా ఎన్నికయింది. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో, విదేశీ వస్తువులను విక్రయించే దుకాణాల పికెటింగ్‌లో పాల్గొంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసి ఆరునెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడానికి, వాటి ప్రదర్శనల కోసం మహిళా సహకార దుకాణాలను ఏర్పాటు చేయడానికి సహాయపడింది.[1]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బొంబాయి సబర్బన్ నియోజకవర్గం నుండి మొదటి సాధారణ ఎన్నికల్లో పోటిచేసి 1వ లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయింది.[2] చైల్డ్ వెల్ఫేర్ కోసం ఇండియన్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా ఉంటూ ఆ సంస్థ కార్యకలాపాలలో పాటు పంచుకుంది.[3] 1980లో మహిళలు, పిల్లల అభివృద్ధి-సంక్షేమం కొరకు జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకుంది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

జయశ్రీ రైజికి 1918తో ఎన్ఎం రైజితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.[1]

మరణం[మార్చు]

జయశ్రీ రైజి 1985లో మరణించింది.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Members Bioprofile: Raiji, Shrimati Jayashri". Lok Sabha. Retrieved 26 November 2017.
  2. "Statistical Report on General Elections, 1951 to the First Lok Sabha" (PDF). Election Commission of India. p. 95. Retrieved 27 November 2017.
  3. "They dared to dream..." Indian Council for Child Welfare. Archived from the original on 24 జూన్ 2019. Retrieved 27 November 2017.
  4. "Smt. Jayashri Raiji". Jamnalal Bajaj Foundation. Retrieved 26 November 2017.
  5. Mankekar, Kamla (2002). Women Pioneers in India's Renaissance, as I Remember her: Contributions from Eminent women of present-day India. National Book Trust, India. p. ix. ISBN 978-81-237-3766-9.