జయ భట్టాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయ భట్టాచార్య
జయ భట్టాచార్య (2015)
జననం
వృత్తిటెలివిజన్, సినిమా నటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, తాప్కీ ప్యార్ కి

జయ భట్టాచార్య, అస్సామీ టెలివిజన్, సినిమా నటి. టీవీ సీరియల్స్‌లో విభిన్నమైన పాత్రలు పోషించడం ద్వారా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ లో పాయల్ పాత్రలో నటించి పేరు పొందింది, కసమ్ సేలో జిగ్యాసా బాలిగా, ఝాన్సీ కి రాణిలో సక్కు బాయిగా, గంగలో సుధా బువాగా నటించింది. 2015 నుండి 2017 వరకు ప్రసారమైన తాప్కీ ప్యార్ కి అనే డ్రామా సిరీస్ లో వసుంధర పాండే పాత్రతో మళ్ళీ ప్రజాదరణ అందుకుంది. 2018 నుండి 2019 వరకు సిల్సిలా బదల్తే రిష్టన్ కా సీరియల్ లో కనిపించింది. తప్కీ ప్యార్ కి 2 లో వీణాదేవి పాత్రను పోషించింది.

జననం[మార్చు]

జయ ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జన్మించింది.

కళారంగం[మార్చు]

దేవదాస్, లజ్జా వంటి హిందీ సినిమాలలో చిన్న పాత్రల్లో నటించింది. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, పాయల్,[1] బానూ మైన్ తేరీ దుల్హన్ వంటి టివి కార్యక్రమాలలో పాల్గొన్నది. కరిష్మా కపూర్ నటించిన 2000ల నాటి హిందీ సినిమా ఫిజాలో అతిథి పాత్రలో నటించింది.[2] జిజ్ఞాసా, కసమ్ సే సినిమాలలో కూడా నటించింది.

జీ టీవీలో ప్రసారమైన ఝాన్సీ కి రాణి అనే చారిత్రాత్మక ధారావాహికలో సక్కుబాయి అవతారంలో నటించింది. 2015-2017 మధ్య ప్రసారం చేయబడిన తాప్కీ ప్యార్ కీ లో నటించడంతోపాటు, బువాగా బధో బహు అనే హిట్ షోలో కూడా పాల్గొన్నది.[3]

సినిమాలు[మార్చు]

 • సిర్ఫ్ తుమ్ (జెన్సీ)
 • ఫిజా - అతిధి పాత్ర
 • క్యో కియీ మెయిన్ ఝుత్ నహిన్ బోల్తా (కవితా మ్హత్రే)
 • దేవదాస్ (పారూ స్నేహితురాలు మనోరమ)
 • లజ్జ (లత)
 • హో సక్తా హై (స్నేహల్‌)
 • జిగ్యాసా (నేహా శర్మ)
 • ఏక్ వివాహ ఐసా భీ
 • కల్పవృక్షం (గురుప్రీత్‌)
 • అంతర్ద్వాంద్ (భాభి)
 • మిమీ (డా. ఆశా దేశాయ్‌)

టెలివిజన్[మార్చు]

 • సరబ్ - డిడి నేషనల్‌లో
 • పాల్ చిన్ (1999) - అంజలి
 • అంబర్ ధార - కామినీ మెహ్రా
 • బానూ మెయిన్ తేరీ దుల్హన్ - గాయత్రీ భువా
 • కహానీ హమారే మహాభారత్ కీ - కుంతీ
 • కైసా యే ప్యార్ హై - దామిని బోస్
 • కరమ్ అప్నా అప్నా - శైలా
 • అశ్విని కల్సేకర్ జిగ్యాస బాలిగా కసమ్ సే
 • కేసర్ - రీమా
 • క్కాంచ్
 • కోశిష్ - ఏక్ ఆషా - సునీతి
 • జై హనుమాన్ - లక్ష్మీ దేవి
 • హతీమ్ - జలీమా
 • క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ - పాయల్ పారిఖ్/పాయల్ ప్రతాప్ మెహ్రా (మిహిర్ మాజీ కాబోయే భార్య/విశాల్ & ఊర్వశి తల్లి)
 • రాజ్ కీ ఏక్ బాత్
 • స్మృతి
 • జై మా దుర్గా (టివి సిరీస్) - దేవి కాళికా, దేవి చాముండా, దేవి చండికా
 • తోడి సి జమీన్ తోడా సా ఆస్మాన్ - పూజ
 • విరాసాత్
 • వో రెహ్నే వాలీ మెహ్లాన్ కీ - సావిత్రి
 • ఝాన్సీ కి రాణి (టివి సిరీస్) - సక్కు బాయి
 • ఐసే కరో నా విదా
 • రామలీల – అజయ్ దేవగన్ కే సాథ్ - మండోధరి
 • ఏక్ థీ నాయకా - చావీ మెహతా
 • ఉపనిషత్ గంగా - రత్నావళి, జబాల
 • డెవాన్ కే దేవ్ మహాదేవ్ - దితి
 • మధుబాల - ఏక్ ఇష్క్ ఏక్ జునూన్
 • భరత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్ - మహామంగా (2014)
 • గంగ - సుధ (2015–2017)
 • తాప్కీ ప్యార్ కి - వసుంధర 'వాసు' బల్వీందర్ పాండే (ధృవ్, కిరణ్ తల్లి/బిహాన్ పెంపుడు తల్లి/బల్వీందర్ భార్య) (2015–2017)
 • సాబ్ జీ (డిడి నేషనల్, 2016)[4] [5]
 • సుష్మాగా బధో బహు
 • సిల్సిలా బదల్తే రిష్టన్ కా - రాధికా మల్హోత్రా (2018–2019)
 • ఢిల్లీ క్రైమ్
 • శుక్లాగా పింజ్రా ఖూబ్‌సుర్తి కా - మంజరి (2020–2021)
 • తాప్కీ ప్యార్ కి 2 - వీణా దేవి సింఘానియాగా (2021–ప్రస్తుతం)

మూలాలు[మార్చు]

 1. "Jolly good Jaya!". The Times of India. 26 November 2006. Retrieved 2022-02-10.
 2. "Jaya Bhattacharya's new avatar". Entertainment One India. 30 August 2007. Archived from the original on 8 July 2012. Retrieved 2022-02-10.
 3. "TV actress Jaya Bhattacharya to enter hit show 'Badho Bahu' | Free Press Journal". Free Press Journal. 2 May 2018. Retrieved 2022-02-10.
 4. "सिद्धार्थ नागर की सार्थक चित्रम की 'साबजी' दूरदर्शन पर प्रसारण". 19 June 2016. Retrieved 2022-02-10.
 5. "Saab Ji - Doordarshan National on Twitter". Retrieved 2022-02-10.

బయటి లింకులు[మార్చు]