జరుగు నరసింహ మూర్తి
జననం | బి. కొత్తకోట, చిత్తూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్, | 1964 జూలై 1
---|---|
జాతీయత | భారతీయుడు |
మాతృ సంస్థ | బెంగళూరు విశ్వవిద్యాలయం |
జరుగు నరసింహ మూర్తి (జననం 1964) ఒక భారతీయ శాస్త్రవేత్త తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ డైరెక్టర్.నరసింహమూర్తి కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ గా పని చేశాడు. [1] నరసింహమూర్తి ఫోటోరియాక్టివిటీ ఆర్గానిక్ అణువుల పై పరిశోధనలు చేశాడు. [2] రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ [3] ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కి లాంటి సైన్సు కంపెనీలో పనిచేశాడు. [4] 2008లో రసాయన శాస్త్రానికి నరసింహమూర్తి చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును అందించింది, ఇది భారతీయ అత్యున్నత సైన్స్ అవార్డులలో ఒకటి. [5]
జీవిత విశేషాలు
[మార్చు]నరసింహమూర్తి, 1964 జులై 1న దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని B. కొత్తకోటలో జన్మించారు, 1985లో నరసింహమూర్తి బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు 1988లో నరసింహమూర్తి అదే విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు [6] తరువాత, నరసింహమూర్తి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరాడు, అక్కడి నుండి నరసింహమూర్తి 1994లో పీహెచ్ డి పొందాడు అదే సంవత్సరంలో నరసింహమూర్తి అమెరికాకు వెళ్ళాడు, అక్కడ నరసింహమూర్తి హౌస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన జే కొచ్చి సూచనల మేరకు పోస్ట్-డాక్టోరల్ అధ్యయనాపై పరిశోధనలు చేశాడు. 1995లో నరసింహమూర్తి, అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫెలోషిప్ అవార్డును పొందాడు. నరసింహమూర్తి 1996లో విక్టోరియా విశ్వవిద్యాలయానికి అక్కడ తన పోస్ట్-డాక్టోరల్ అధ్యయనాలను పూర్తి చేశాడు. నరసింహమూర్తి జూన్ 1998లో ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. అయితే అక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉండి , కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మారాడు, అక్కడ నరసింహమూర్తి 2003 నుండి 2008 వరకు ప్రొఫెసర్గా పనిచేశాడు. 2011–14 మధ్య కాలంలో లలిత్ ఎం. కపూర్ చైర్ ప్రొఫెసర్, గా నరసింహమూర్తి పనిచేశాడు [7]. [8]
అవార్డులు
[మార్చు]నరసింహమూర్తి 2003లో కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా యంగ్ కెమిస్ట్ అవార్డును అందుకున్నారు. [9] నరసింహమూర్తికి 2008లో అత్యున్నత భారతీయ సైన్స్ అవార్డులలో ఒకటైన శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ని అందించింది [10] నరసింహమూర్తి 2010లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ [4] అవార్డును అందుకున్నాడు. 2014లో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీచే ఫెలోగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Professor, Department of Chemistry". IIT Kanpur. 2016.
- ↑ "Brief Profile of the Awardee". Shanti Swarup Bhatnagar Prize. 2016. Retrieved 12 November 2016.
- ↑ "Faculty profile". IIT Kanpur. 2016. Archived from the original on 2022-05-20. Retrieved 2024-01-15.
- ↑ 4.0 4.1 "Fellow profile". Indian Academy of Sciences. 2016.
- ↑ "View Bhatnagar Awardees". Shanti Swarup Bhatnagar Prize. 2016. Retrieved 12 November 2016.
- ↑ "Biodata on IITK" (PDF). IIT Kanpur. 2016. Archived from the original (PDF) on 2022-10-09. Retrieved 2024-01-15.
- ↑ "Lalit M. Kapoor Chair Professorship". IIT Kanpur. 2016. Archived from the original on 20 December 2016. Retrieved 4 December 2016.
- ↑ "Jag Mohan Garg Chair Professorship". IIT Kanpur. 2016. Archived from the original on 20 December 2016. Retrieved 4 December 2016.
- ↑ "CRSI Bronze Medal". Chemical Research Society of India. 2016. Archived from the original on 16 October 2016. Retrieved 4 December 2016.
- ↑ "Chemical Sciences". Council of Scientific and Industrial Research. 2016. Archived from the original on 2012-09-12.