జల్ మిస్త్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జల్ మిస్త్రీ
జననం1923
మరణం2000 (aged 76–77)
వృత్తిసినిమాటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు1949 - 2000
బంధువులుఫాలి మిస్త్రీ (అన్న)

జల్ మిస్త్రీ, (1923-2000) హిందీ సినిమా ఛాయాగ్రాహకుడు. దర్శకుడు చేతన్ ఆనంద్ తో, నవకేతన్ ఫిల్మ్స్‌తో కలిసి ఆఖరీ ఖత్ (1966), హీర్ రాంజా (1970), కుద్రాట్ (1981) మొదలైన సినిమాలకు పనిచేశాడు.[1] రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బర్సాత్ (1949), మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన నసీబ్ (1981) వంటి విజయవంతమైన సినిమాలకు కూడా పనిచేశాడు. రాజ్ ఖోస్లాతో కలిసి దేవ్ ఆనంద్ నటించిన బొంబాయి కా బాబు (1960) సినిమాను నిర్మించాడు.

జీవిత విషయాలు

[మార్చు]

జల్ మిస్త్రీ 1923లో జన్మించాడు, 2000లో మరణించాడు.

సినిమారంగం

[మార్చు]

అన్నయ్య ఫాలి మిస్త్రీ (1917-1979) తో పాటు, మిస్త్రీ సోదరులు హిందీ సినిమారంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.[2][3] కమల్ అమ్రోహి రూపొందించిన క్లాసిక్ సినిమా పాకీజా (1972) ప్రధాన సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ విర్స్చింగ్ అందుబాటులో లేని సమయంలో ఇతడు కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు.[4]

అవార్డులు

[మార్చు]

బహరోన్ కే సాప్నే (1968), హీర్ రాంజా (1971), జీల్ కే ఉస్ పార్ (1974), కుద్రాట్ (1982) మొదలైన సినిమాలకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా నాలుగు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు.[3]

సినిమాలు

[మార్చు]
  • బార్సాట్ (1949)
  • జాన్ పెహ్చన్ (1950)
  • ఆంధియన్ (1952)
  • యురాన్ ఖటోలా (1955)
  • హీర్ (1956)
  • బొంబాయి కా బాబు (1960) (సహ నిర్మాత కూడా)
  • ఆఖ్రీ ఖాట్ (1966)
  • బహరోన్ కే సాప్నే (1967)
  • హమ్సయ (1968)
  • హీర్ రాంజా (1970)
  • మన్ మందిర్ (1971)
  • బొంబాయి టు గోవా (1972)
  • హర్ జీత్ (1972)
  • జీల్ కే ఉస్ పార్ (1973)
  • బిడాయి (1974)
  • భన్వర్ (1976)
  • చల్తా పూర్జా (1977)
  • నసీబ్ (1981)
  • కుద్రాత్ (1981)
  • తేరి కసం (1982)
  • అల్లాహ్ రాఖా (1986)
  • ఇతిహాస్ (1987)
  • మెయిన్ తేరే లియే (1988)
  • అభిమన్యు (1989)
  • ప్రేమ్ గ్రంథ్ (1996)
  • జూత్ బోలే కౌవా కాటే (1998)

మూలాలు

[మార్చు]
  1. Derek Bose (1 January 2006). Everybody Wants a Hit: 10 Mantras of Success in Bollywood Cinema. Jaico Publishing House. pp. 71–. ISBN 978-81-7992-558-4.
  2. "Their SHOT at fame". The Hindu. 9 September 2003. Archived from the original on 1 August 2004. Retrieved 27 April 2013. ..the immensely talented cinematographer duo, the Mistry brothers Fali and Jal,..
  3. 3.0 3.1 Gulzar, p. 590
  4. Meghnad Desai. PAKEEZAH. HarperCollins Publishers India. pp. 23–. ISBN 978-93-5116-023-6.

బయటి లింకులు

[మార్చు]