ఆఖరీ ఖత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆఖరీ ఖత్
ఆఖరీ ఖత్ సినిమా పోస్టర్
దర్శకత్వంచేతన్ ఆనంద్
రచనచేతన్ ఆనంద్
నిర్మాతహిమాలయ ఫిల్మ్స్
తారాగణంరాజేష్ ఖన్నా
ఇంద్రాణి ముఖర్జీ
ఛాయాగ్రహణంజల్ మిస్త్రీ
కూర్పుజాదవ్ రావు
సంగీతంఖయ్యామ్
కైఫీ అజ్మీ (పాటలు)
పంపిణీదార్లుప్రభ పిక్చర్స్
విడుదల తేదీ
1966, డిసెంబరు 30
సినిమా నిడివి
114 నిముషాలు
దేశంభారతదేం
భాషహిందీ

ఆఖరీ ఖత్, 1966 డిసెంబరు 30న విడుదలైన హిందీ సినిమా. హిమాలయ ఫిల్మ్స్ బ్యానరులో చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రాజేష్ ఖన్నా బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.[1] ఇందులో ఇంద్రాణి ముఖర్జీ, మాస్టర్ బంటీ, నానా పాల్సికర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఖయ్యామ్ సంగీతం అందించగా, కైఫీ అజ్మీ పాటలు రాశాడు; లతా మంగేష్కర్ పాడిన "బహరోన్ మేరా జీవన్ భీ సన్వారో" పాటకు మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ గైడ్ కలెక్షన్స్‌లో ఈ సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడింది.

చేతన్ ఆనంద్, ఈ సినిమా స్క్రిప్ట్ తో 15 నెలలపాటు నగరంలో తన కెమెరాతో సినిమాటోగ్రాఫర్ జల్ మిస్త్రీతో కలిసి ఎక్కువగా చేతితో పట్టుకున్న కెమెరాతో, నగరంలోని అన్ని శబ్దాలను తీసుకున్నాడు.[2] 1967లో జరిగిన 40వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో తొలిసారిగా భారతదేశం తరపున ఎంట్రీకి పంపబడింది, కాని నామినీగా అంగీకరించబడలేదు.[3][4]

1979లో శివకుమార్, సుజాత జంటగా పూంతాలిర్ పేరుతో తమిళంలో, 1981లో చిన్నారి చిట్టిబాబుపేరుతో తెలుగుతో రిమేక్ అయింది.[5]

నటవర్గం

[మార్చు]
 • రాజేష్ ఖన్నా (గోవింద్)
 • ఇంద్రాణి ముఖర్జీ (లజ్జో)
 • మాస్టర్ బంటీ (బంటు)
 • నానా పాల్సికర్
 • మన్వేంద్ర చిట్నిస్ (ఇన్స్పెక్టర్ నాయక్)
 • మోహన్ చోటి (మోతీ)
 • తున్ తున్
 • మారుతి రావు
 • నకి జెహన్

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకు ముహమ్మద్ జహూర్ ఖయ్యాం సంగీతం అదించాడు. భూపిందర్ సింగ్ సోలో సింగర్ గా అరంగేట్రం చేసాడు.[6]

పాట గాయకులు
"ఔర్ కుచ్ డెర్ తహార్" ముహమ్మద్ రఫీ
"బహరోన్ మేరా జీవన్ భీ సన్వారో" లతా మంగేష్కర్
"మేరే చందా మేరే నాన్హే" లతా మంగేష్కర్
"ఓ మై డార్లింగ్" మన్నా డే
"రూట్ జవాన్ జవాన్ రాత్ మెహర్బాన్" భూపిందర్ సింగ్

మూలాలు

[మార్చు]
 1. "'Few paid attention to Rajesh Khanna's debut film'". Rediff. Retrieved 2021-06-12.
 2. Biswas, Premankur (16 November 2007). "Chetan Anand, My Father". The Indian Express. Archived from the original on 30 September 2012. Retrieved 2021-06-12.
 3. Margaret Herrick Library, Academy of Motion Picture Arts and Sciences
 4. "Rajesh Khanna and His Films". BollywoodMantra. Archived from the original on 2021-06-12. Retrieved 2021-06-12.
 5. ""Yevo Gusagusalu Paade – Chinnari Chitti Babu" (1981) – Telugu Feature Film". The Southern Nightingale. 2017-01-19. Archived from the original on 2021-06-12. Retrieved 2021-06-12.
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-06-12. Retrieved 2021-06-12.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆఖరీ_ఖత్&oldid=4203505" నుండి వెలికితీశారు