Jump to content

జస్ట్ ఎ మినిట్

వికీపీడియా నుండి
జస్ట్ ఎ మినిట్
దర్శకత్వంపూర్ణస్ యశ్వంత్
స్క్రీన్ ప్లేఅర్షద్ తన్వీర్
కథఅర్షద్ తన్వీర్
నిర్మాతఅర్షద్ తన్వీర్, డా. ప్రకాష్ ధర్మపురి
తారాగణం
  • అభిషేక్ పచ్చిపాల
  • నజియా ఖాన్
  • వినీషా
  • ఇషితా సింగ్
ఛాయాగ్రహణంఅమీర్
కూర్పుదుర్గ నరసింహ
సంగీతంఎస్.కె.బాజీ
నిర్మాణ
సంస్థలు
సుధర్మ మూవీ మేకర్స్, రెడ్ స్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
19 జూలై 2024 (2024-07-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

జస్ట్ ఎ మినిట్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] కార్తీక్ ధర్మపురి సమర్పణలో సుధర్మ మూవీ మేకర్స్, రెడ్ స్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్షద్ తన్వీర్, డా. ప్రకాష్ ధర్మపురి నిర్మించిన ఈ సినిమాకు పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించారు. అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 13న విడుదల చేసి,[2] సినిమాను జులై 19న విడుదల చేశారు.[3]

రవి (అభిషేక్ పచ్చిపాల) త‌న‌కు సెక్స్‌కు సంబంధించి ఓ స‌మ‌స్య ఉంద‌నే అపోహ‌తో భ‌య‌ప‌డుతుంటాడు. ఆ స‌మ‌స్య నుంచి బయటపడడం కోసం తన స్నేహితుడైన రాంబాబు స‌హాయంతో తిక్క‌తిక్క ప‌నుల‌న్నీ చేస్తాడు. కానీ అవ‌న్నీ బెడిసికొడ‌తాయి. అలాంటి సమయంలో పూజ (నజియా ఖాన్) ర‌వి జీవితంలోకి వ‌స్తోంది. పూజ‌ను ప్రేమిస్తాడు ర‌వి. కానీ త‌న‌కున్న స‌మ‌స్య‌ కార‌ణంగా పూజ ప‌ట్ల మ‌న‌సులో ఉన్న‌ ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేయ‌లేక ఇబ్బందులు ప‌డ‌తాడు? ఇంత‌కీ రవికి ఉన్న సమస్య ఏంటి? ర‌వి స‌మ‌స్య‌ను పూజ అర్థం చేసుకుందా? అత‌డి ప్రేమ‌కు అంగీకరించిందా? లేదా? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • అభిషేక్ పచ్చిపాల
  • నజియా ఖాన్
  • వినీషా
  • ఇషితా సింగ్
  • జబర్దస్త్ ఫణి
  • సతీష్ సారిపల్లి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సుధర్మ మూవీ మేకర్స్, రెడ్ స్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: అర్షద్ తన్వీర్, డా. ప్రకాష్ ధర్మపురి
  • కథ, స్క్రీన్‌ప్లే: అర్షద్ తన్వీర్
  • దర్శకత్వం: పూర్ణస్ యశ్వంత్
  • సంగీతం: ఎస్.కె.బాజీ
  • సినిమాటోగ్రఫీ: అమీర్
  • ఎడిటర్: దుర్గ నరసింహ
  • పాటలు: గోసాల రాంబాబు[5]

మూలాలు

[మార్చు]
  1. NT News (14 July 2024). "వినోదభరితంగా జస్ట్‌ ఎ మినిట్‌". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  2. Chitrajyothy (13 July 2024). "మంచి ఫన్ కాన్సెఫ్ట్‌తో 'జస్ట్ ఏ మినిట్'.. ట్రైలర్ విడుదల". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  3. Nava Telangana (13 July 2024). "జస్ట్‌ ఏ మినిట్‌ రిలీజ్‌కి రెడీ". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  4. Sakshi (20 July 2024). "జస్ట్ ఎ మినిట్ మూవీ ఎలా ఉందంటే..?". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  5. Chitrajyothy (13 February 2024). "ప్రేమికుల రోజు.. 'జస్ట్ ఎ మినిట్' లవ్ సాంగ్ రిలీజ్". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.