Coordinates: 15°49′16″N 80°02′28″E / 15.821°N 80.041°E / 15.821; 80.041

జాగర్లమూడివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°49′16″N 80°02′28″E / 15.821°N 80.041°E / 15.821; 80.041
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంజే.పంగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523212 Edit this on Wikidata


జాగర్లమూడివారిపాలెం బాపట్ల జిల్లా, జే.పంగులూరు మండలంలోని రెవెన్యూయేతర గ్రామంపటం

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పేరెలా వచ్చింది[మార్చు]

1802 ప్రాంతంలో బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామం నుండి జాగర్లమూడి రామయ్య, వెంకయ్య, సుబ్బన్న సోదరులు ఈ ప్రాంతానికి తరలి వచ్చారు. అప్పటి జమీందారుల ఆసరాతో ఇక్కడ నివాసాలు ఏర్పాటుచేసుకొని వ్యవసాయం చేసేవారు. వీరి తరువాత మరికొన్ని కుటుంబలు ఇక్కడకు తరలి వచ్చినవి. 1840 ప్రాంతంలో రామయ్య చెరువును తవ్వించి భవిష్యత్తులో దాని అభివృద్ధికి కొంత మాన్యం ఏర్పాటు చేశారు. దాంతో ఈ గ్రామాన్ని అప్పట్లో 'జాగర్లమూడి వారి ఊరు" గానూ, చెరువును "జాగర్లమూడి రామన్న కుంట గానూ పిలిచేవారు. కాలక్రమేణా ఈ గ్రామం జాగర్లమూడివారిపాలెంగా నామాంతరం చెందినది. [2]

రవాణా సౌకర్యాలు:[మార్చు]

ఈ గ్రామానికి అన్ని రవాణా మార్గములు బాగానే ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ వూరిలో 1 నుండి 5 వరకు మాత్రమే స్కూలు ఉంది. తరువాత చదువులకు ప్రక్క ఊరిపై ఆధారపడవలసి ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 1995 లో ముప్పవరం పంచాయతీలో అంతర్భాగంగా ఉన్న ఈ గ్రామం, 1996లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. మొదటి సర్పంచిగా ధూళిపాళ్ళ సీతారాములు విజయం సాధించారు.
  2. కీ.శే.ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి జాగర్లమూడి వెంకయమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా తెలగతోటి రాధాకృష్ణమూర్తి ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ మహా గణపతిస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని 8 లక్షల రూపాయల గ్రామస్తుల విరాళాలతో సుందరంగా నిర్మించారు. 2016, నవంబరు-13వతేదీ ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్య వైభవంగా నిర్వహించెదరు. అనంతరం అన్నప్రసాద వితరణ చేసెదరు.

ఈ గ్రామ సమీపములో, దాతల విరాళాలతో, 2015, మార్చి-25వ తేదీ బుధవారం నాడు, శ్రీవారి నామాల ప్రతిష్ఠా కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. స్థానికులు శ్రీ జాగర్లమూడి మల్లిఖార్జునరావు, సూర్యప్రకాశరావు, తమ తల్లిదండ్రులు శ్రీమతి సుబ్బమ్మ, శ్రీ నారయ్యల ఙాపకార్ధం, ఒకటిన్నర లక్షల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టినారు.

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • దూళిపాళ్ళ రమాదేవి గుంటూరు జిల్లా సిపియం మొదటి మహిళా కార్యదర్శి

మూలాలు[మార్చు]


వెలుపలి లంకెలు[మార్చు]