జాతీయ ఐక్యతా దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ ఐక్యతా దినోత్సవం
ప్రాముఖ్యతసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
జరుపుకొనే రోజు31 అక్టోబరు
ఆవృత్తివార్షికం
అనుకూలనం31 అక్టోబరు 2018

జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఆయన గౌరవార్దం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుతారు

గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సంబంధ కార్యాలయాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించాలని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.

దేశ సార్వభౌమత్వం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని పాఠశాలలోని, కళాశాలల్లోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సూచించింది. ఈ దినోత్సవం నాడు విద్యార్థులతో ఐక్యతా ప్రతిజ్ఞను చేయించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తమకనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలను "సీబీఎస్‌ఈ" కోరింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఈనాడు దినపత్రిక - 25-10-2014 – (జాతీయ ఐక్యతా దినోత్సవంగా పటేల్ జయంతి)