జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎన్ సి పి ఎ) (The National Pharmaceutical Pricing Authority (NPPA) భారతదేశంలో ఔషధముల (ఫార్మాస్యూటికల్ ) మందుల ధరలను నియంత్రించే ప్రభుత్వ నియంత్రణ సంస్థ. 1997 ఆగస్టు 29న రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్మెంట్ (డిఓపి) అనుబంధ కార్యాలయంగా, మందుల ధరలను నిర్ణయించడానికి,ప్రజలకు తక్కువ ధరలలో మందుల లభ్యత, నాణ్యత నిర్ధారించడానికి స్వతంత్ర నియంత్రణ సంస్థగా ఏర్పడింది[1].

జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎన్ సి పి ఎ)
దస్త్రం:Logo of National Pharmaceutical Pricing Authority.png
సంస్థ అవలోకనం
స్థాపనం మూస:ప్రారంభం
అధికార పరిధి భారతదేశం
ప్రధాన కార్యాలయం 3rd/5th అంతస్తులు , వై ఎం సి వై ఎం సి ఎ కల్చరర్ సెంటర్ బిల్డింగ్ 1, జై సింగ్ రోడ్

, న్యూ ఢిల్లీ , భారతదేశం

ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ కమలేష్ కుమార్ పంత్, చైర్మన్
మాతృ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు,ఎరువుల మంత్రిత్వ శాఖ

విధులు

[మార్చు]

రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సంస్థ ద్వారా ప్రైస్ మానిటరింగ్ అండ్ రిసోర్స్ యూనిట్ (పిఎంఆర్ యు ) ఏర్పాటు చేయబడింది. వినియోగ దారులలో అవగాహన (కన్స్యూమర్ అవేర్నెస్) చేయడం. డిజిటల్ ఆప్ ల ద్వారా మందుల ధరలను నియంత్రించేందుకు అప్లికేషన్, ఫార్మా జనసమాధన్ దీనిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ, ఫార్మా డేటా బ్యాంక్, ఇందులో ఫార్మా కంపెనీల నుంచి ఆన్ లైన్ సమాచార సేకరణ, ఎప్పటికప్పుడు జారీ చేసే ఔషధ (ధరల నియంత్రణ) ఉత్తర్వుల కింద షెడ్యూల్డ్ ఔషధాల ధరలను నిర్ణయించడం, సవరించడం, ధరల పర్యవేక్షణ, అమలు, నాన్ షెడ్యూల్డ్ ఔషధాలతో సహా అన్ని ఔషధాలు , వైద్య పరికరాల లభ్యత , నాణ్యత ధృవీకరించడం, ఔషధాలు/ఫార్ములేషన్ ల ధరలకు సంబంధించి సంబంధిత అధ్యయనాలను చేపట్టడం, బల్క్ డ్రగ్స్ , ఫార్ములేషన్ల ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు, వ్యక్తిగత కంపెనీల మార్కెట్ వాటా, కంపెనీల లాభదాయకత మొదలైన వాటిపై డేటాను సేకరించడం/ నిర్వహించడం. అథారిటీ నిర్ణయాల వల్ల ఉత్పన్నమయ్యే అన్ని చట్టపరమైన విషయాలను పరిష్కరించడం,ఔషధ విధానంలో మార్పులు/సవరణలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం వంటి చర్యలు చేస్తుంది[2].

ధరల స్థిరీకరణ

[మార్చు]

ఈ సంస్థ మందుల ధరలను చౌకగా ప్రజలకు అందుబాటులో తేవడానికి ఈ విధంగా పనిచేస్తుంది. అందుబాటు ధరల్లో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) అనుబంధ కార్యాలయం ,డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (డిఓపి), మందుల ధరలను నియంత్రించడం తప్పనిసరి[3].

  • ఔషధాల లభ్యత, అందుబాటును ధృవీకరించడం కొరకు ప్రభుత్వం ఔషధాల ధరలను నియంత్రిస్తుంది
  • మందులు, వైద్య పరికరాల అందుబాటును నిర్ధారించడానికి అనేక చర్యలు తీసుకోవడం.
  • 355 ఔషధాలకు గరిష్ట ధరలు, 886 ఫార్ములేషన్లకు గరిష్ట ధరలను నిర్ణయించారు.
  • అత్యవసర ఔషధాల జాబితా, 2015 (ఔషధ ధరమూలము ల నియంత్రణ ఆర్డర్ (డిపిసిఒ) షెడ్యూల్-1, 2013)
  • 31 డిసెంబర్ 2021. డిపిసిఒ కింద సుమారు 1798 ఫార్ములేషన్లకు రిటైల్ ధరలు నిర్ణయించబడ్డాయి,
  • 2013 డిసెంబర్ 31 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు, ఇటీవలి సంవత్సరాలలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా డీపీసీవో- 2013, కరోనరీ స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్ల ధరలను కూడా నిర్ణయించారు.
  • ఎంపిక చేసిన 42 యాంటీ-క్యాన్సర్ నాన్-షెడ్యూల్పై ఎన్పిపిఎ ట్రేడ్ మార్జిన్ను 30 శాతానికి పరిమితం చేసింది.
  • 2019 ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా వైద్యం చేసారు.

అవసరం

[మార్చు]

బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్ల ధరలను నిర్ణయించడం/సవరించడం, దేశవ్యాప్తంగా మందుల ఖర్చులు, అందుబాటును అమలు చేయడం ఎన్పీపీఏ బాధ్యత, తక్కువ మందుల ధరలను నిర్వహించడానికి, వాటి ఖర్చులపై కూడా నిఘా ఉంచుతుంది. వ్యాపారాలు, వినియోగదారులు ఇద్దరూ ప్రయోజనం పొందేలా చూడటానికి, ప్రభుత్వం వాటి మధ్య స్పష్టమైన సరిహద్దును రూపొందించడానికి పనిచేస్తోంది. ఇవి అన్ని ఆచరణలో, నిలకడగా ఉండాలంటే ఇలాంటి చర్యలు అమలు చేయాలి. ఈ సంస్థ షెడ్యూల్డ్ మందుల ఖర్చులను మాత్రమే నియంత్రిస్తుంది, ఈ షెడ్యూలులో ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో 16–17% ఉంటుంది. డిపిసిఒ 2013 మొదటి షెడ్యూల్ లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కూడా ఉన్నాయి. అధిక మార్కప్ ల ఫలితంగా అధిక ధరల విధానాలకు దారితీసిన నాన్ షెడ్యూల్డ్ కేటగిరీ, అదనపు నియంత్రణ అవసరాన్ని గురిస్తున్నది. ప్రజల అందరికీ తక్కువ ధరలలో మందులు ఇవ్వడడం, వాటి నాణ్యత పెంచితే దేశ ప్రజల ఆరోగ్యం బాగుగా ఉండటమేగాక, ప్రజల ఖర్చులు మందులపై తగ్గటం, విదేశీ మారకం పొదుపు చేయడం వంటి ప్రయోజనం వల్ల "ఆరోగ్యమే మహాభాగ్యం " సూక్తి అమలులో జరుగుతుంది[1].


మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "National Pharmaceutical Pricing Authority (NPPA)". GeeksforGeeks (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-09-19. Retrieved 2023-02-04.
  2. "National Pharmaceutical Pricing Authority (NPPA) : Daily Current Affairs". Dhyeya IAS® - Best UPSC IAS CSE Online Coaching | Best UPSC Coaching | Top IAS Coaching in Delhi | Top CSE Coaching (in ఇంగ్లీష్). Retrieved 2023-02-04.
  3. "Page 219 - economic_survey_2021-2022". www.indiabudget.gov.in. Retrieved 2023-02-04.