Jump to content

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్

వికీపీడియా నుండి
జాతీయ ఆరోగ్య మిషన్ కార్యలయం, బోఫాల్

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (National Rural Health Mission) అనేది భారతదేశం మొత్తానికి ముఖ్యంగా బలహీనమైన ఆరోగ్య సూచికలున్న, మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న 18 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు సమర్ధవంతమైన ఆరోగ్య రక్షణనివ్వడానికి ఉద్దేశించింది.ఈ పథకాన్ని 2005, ఏపిల్ 12వ తేదీన ఆనాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రామదాస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించాడు. ఈ పధకంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్ గడ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మధ్య ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాంచల్, ఉత్తర్ ప్రదేశ్. ఈ పథకం లో భాగంగా ఆశా వర్కర్స్ కార్యక్రమం కూడా ప్రారంభించారు.

పధకం లక్ష్యాలు

[మార్చు]
  • శిశు మరణ రేటు (Infant Mortality Rate), తల్లి మరణ రేటు (Maternal Mortality Rate)లను తగ్గించడం.
  • స్త్రీ ఆరోగ్యం, శిశు ఆరోగ్యం, నీరు, పారిశుధ్యం, రోగనిరోధకీశరణ, పోషక విలువలు వంటి సేవలను విశ్వజనీకరంగా అందుకోవడం.
  • స్థానికంగా వచ్చే రోగాలతోబాటు అంటు రోగాలను నిరోధించడం, వాటి వ్యాప్తిని అరికట్టడం
  • సమీకృత ప్రాథమిక ఆరోగ్య రక్షణ పొందే వీలు కల్పించడం.
  • జనాభా నియంత్రణ, స్థల , లింగ సమతుల్యత.
  • స్థానిక ఆరోగ్య సంప్రదాయాలను పునరుద్ధరించడం, ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ప్రధానంగా పెంచడం.
  • ఆరోగ్యదాయకమైన జీవనశైలిని ప్రోత్సహించడం.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]