జాతీయ పత్రికా దినోత్సవం
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు.[1]
నేపథ్యం
[మార్చు]1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా[1]ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.
విశేషాలు
[మార్చు]భారతదేశంలోనే కాకుండా చాలా ప్రపంచ దేశాలలో ప్రెస్ కౌన్సిళ్ళు ఉన్నాయి. అయితే భారతదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. అనేక సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇక అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించడం కూడా జరిగింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Press Council of India". presscouncil.nic.in. Retrieved 2021-11-16.
- ↑ "నేడు జాతీయ పత్రికా దినోత్సవం - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-09-03.