జాతీయ విజ్ఞాన దినోత్సవము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ విజ్ఞాన దినోత్సవము సందర్భంగా విద్యార్థుల విజ్ఞానశాస్త్ర ప్రదర్శన

జాతీయ విజ్ఞాన దినోత్సవమును భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జరుపుకుంటారు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన చంద్రశేఖర వేంకట రామన్ 28-02-1928న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు. ఆయన ఈ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఈ రోజును (ఫిబ్రవరి 28) నేషనల్‌ సైన్స్‌ డే[1] గా జరుపుకుంటున్నారు.[2]

సి.వి.రామన్

[మార్చు]

రామన్‌ ఎఫెక్ట్‌ అనే అంశం పై నేచర్‌ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో సి.వి.రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి 1954లో భారతరత్న బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్).

ఇవి కూడా చూడండి

[మార్చు]

సి.వి.రామన్ - రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన భారత శాస్త్రవేత్త

ములాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sumitra (2020-02-28). "జాతీయ సైన్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?". www.hmtvlive.com. Archived from the original on 2021-11-21. Retrieved 2021-11-21.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2015-02-27. Retrieved 2020-02-28.