జాతీయ వైద్య గ్రంథాలయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జాతీయ వైద్య గ్రంథాలయం (National Medical Library) ఒక ప్రత్యేకమైన వైద్య గ్రంథాలయం. ఇది ఏప్రిల్ 1, 1966 తేదీన భారత ప్రభుత్వం ద్వారా న్యూఢిల్లీలో స్థాపించబడింది.

ఇది శాస్త్రవేత్తలకు అవసరమైన వైద్య సమాచారాన్ని అందజేయాలనే ధ్యేయంతో స్థాపించబడింది. ఇందులో సుమారు 3.6 లక్షల పుస్తకాలు, జర్నల్స్ మరియు ఇతర సమాచారానికి చెందినవి ఉన్నాయి. దీని ద్వారా సుమారు 2000 పైగా జర్నల్స్ ప్రతి సంవత్సరం కొని చేరతాయి. ఈ అమూల్యమైన గ్రంథాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం ఏర్పరచబడి; అందరికీ సులువుగా వెతికి తీయడానికి ఏర్పాటుచేయబడ్డాయి.

ఈ గ్రంథాలయం వైద్య లైబ్రేరియన్లకు శిక్షణా కార్యక్రమాల్ని 1980 నుండి నిర్వహిస్తుంది. ఇప్పటికి ఇలాంటి 17 శిబిరాల్ని నిర్వహించి; దేశవ్యాప్తంగా 150 లైబ్రరీయన్లను గ్రంథాలయ నిర్వహణ గురించి విలువైన సమాచారాన్ని తెలియజేసింది. దేశమంతటా ఎక్కడ నుండైనా వైద్య విద్యార్థులు వారి వైద్యవిద్య మరియు పరిశోధన కోసం కావలసిన సమాచారాన్ని ఇందులో సభ్యునిగా చేరి ఇక్కడనుండి పొందవచ్చును.

బయటి లింకులు[మార్చు]