జాన్ గై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ గై
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ విలియం గై
పుట్టిన తేదీ (1934-08-29) 1934 ఆగస్టు 29 (వయసు 89)
నెల్సన్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి స్లో-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 76)1955 నవంబరు 7 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1961 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 12 90
చేసిన పరుగులు 440 3,923
బ్యాటింగు సగటు 20.95 25.80
100లు/50లు 1/3 3/24
అత్యధిక స్కోరు 102 115
వేసిన బంతులు 0 90
వికెట్లు 1
బౌలింగు సగటు 82.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/0
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 32/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 1

జాన్ విలియం గై (జననం 1934, ఆగస్టు 29) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1955 -1961 మధ్యకాలంలో న్యూజీలాండ్ జాతీయ జట్టు తరపున 12 టెస్టులు ఆడాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నివసిస్తున్నాడు.

జననం, విద్య[మార్చు]

గై 1934, ఆగస్టు 29న నెల్సన్‌లో జన్మించాడు.[1] 1950 - 1953 మధ్యకాలంలో నెల్సన్ కళాశాలలో చదువుకున్నాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1953–54లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[3] తన ఉద్యోగ జీవితంలో న్యూజీలాండ్ చుట్టూ తిరుగుతూ తరువాత కాంటర్బరీ, ఒటాగో, వెల్లింగ్టన్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1972-73లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లతో తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ముగించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఐదు న్యూజీలాండ్ ప్రావిన్షియల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.[4] 1958 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున కూడా రెండుసార్లు ఆడాడు.[3]

1955-56లో పాకిస్తాన్ పర్యటనలో తన మొదటి టెస్టులు ఆడాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన సిరీస్‌లో 34.77 సగటుతో 313 పరుగులు చేశాడు.[5] మొదటి టెస్టులో ఒక సెంచరీ (102), మూడవ టెస్టులో 52, నాలుగో టెస్టు 91 పరుగులు చేశాడు.[6]

1960ల ప్రారంభంలో షెల్ కోసం పనిచేశాడు.[7] క్రికెట్ కెరీర్ ముగిసిన తరువాత, జాతీయ సెలెక్టర్ అయ్యాడు. న్యూబరీ క్రికెట్ బ్యాట్‌లకు ప్రతినిధిగా ఉన్నాడు. తోటి న్యూజీలాండ్ క్రికెటర్ లాన్స్ కెయిర్న్స్ ఉపయోగించే భుజం లేని ఎక్స్‌కాలిబర్ బ్యాట్‌ను గై అభివృద్ధి చేశాడు.[8][9]

మూలాలు[మార్చు]

  1. జాన్ గై at ESPNcricinfo
  2. "Full school list of Nelson College, 1856–2005". Nelson College Old Boys' Register, 1856–2006 (CD-ROM) (6th ed.). 2006.
  3. 3.0 3.1 "John Guy". CricketArchive. Retrieved 7 August 2022.
  4. Francis Payne & Ian Smith, eds, 2021 New Zealand Cricket Almanack, Upstart Press, Takapuna, 2021, p. 274.
  5. "Test Batting and Fielding in Each Season by John Guy". CricketArchive. Retrieved 7 August 2022.
  6. Don Neely & Richard Payne, Men in White: The History of New Zealand International Cricket, 1894–1985, Moa, Auckland, 1986, pp. 238–52.
  7. NZ Cricketer Comes to Gisborne
  8. Coverdale, Brydon. "The man behind Excalibur". ESPNcricinfo. Retrieved 7 May 2019.
  9. Eva, B., "Kiwi Cairns' six sixes in 1983", The Sunday Age, 3 February 2013, Sport section, p. 20.

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జాన్_గై&oldid=4081138" నుండి వెలికితీశారు