జాన్ రిచర్డ్ హిక్స్
నియో-కీనేసియన్ ఎకనామిక్స్ | |
---|---|
జననం | వార్విక్, ఇంగ్లాండు, యు.కె | 1904 ఏప్రిల్ 8
మరణం | 1989 మే 20 బ్లాక్లీ, ఇంగ్లాండు, యు.కె | (వయసు 85)
జాతీయత | బ్రిటిష్ |
సంస్థ | గోన్విల్లీ & కైయస్ కాలేజి, కేంబ్రిడ్జ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ మాంచెస్టర్ విశ్వవిద్యాలయం న్యుఫీల్డ్ కాలేజీ, ఆక్స్‌ఫర్డు |
పూర్వ విద్యార్థి | బాలియాల్ కాలేజీ, ఆక్స్‌ఫర్డు |
ప్రభావం | లియాన్ వాల్రస్, ఫ్రెడిరిక్ హేక్, లియోనెల్ రాబిన్స్, ఎరిక్ లిండాల్ |
రచనలు | IS–LM మోడల్ కేపిటల్ థియరీ , వినియోగదారు సిద్ధాంతం, జనరల్ ఈక్విబ్రియం థియరీ, వెల్ఫేర్ థియరీ |
పురస్కారములు | అర్థశాస్త్రపు నోబెల్ బహుమతి (1972) |
Information at IDEAS/RePEc |
సర్ జాన్ హిక్స్ (1904 ఏప్రిల్ 8 - 1989 మే 20) బ్రిటిష్ ఆర్థికవేత్త. అతను ఇరవయ్యవ శతాబ్దపు అతి ముఖ్యమైన, ప్రభావవంతమైన ఆర్థికవేత్తలలో ఒకరిగా పరిగణించబడ్డాడు. సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో వినియోగదారుల డిమాండ్ సిద్ధాంతం, IS-LM మోడల్ (1937), స్థూల ఆర్థిక శాస్త్రం యొక్క కీనేసియన్ దృక్పథాన్ని సంగ్రహించిన ఆర్థిక శాస్త్ర రంగంలో అతను చేసిన అనేక రచనలలో బాగా ప్రసిద్ధి పొందాయి. అతను రాసిన "వాల్యూ అండ్ కేపిటల్" (1939) పుస్తకం సాధారణ-సమతుల్యత, విలువ సిద్ధాంతాన్ని గణనీయంగా విస్తరించింది. ప్రతికృత డిమాండ్ ప్రమేయానికి అతని జ్ఞాపకార్థం హిక్సియన్ డిమాండ్ ఫంక్షన్ అని పేరు పెట్టారు[1].
అర్థశాస్త్రంలో సాధారణ సమతౌల్య సిద్ధాంతం, సంక్షేమ సిద్ధాంతం కొరకు అమెరికా ఆర్థికవేత్త కెన్నెత్ జోసెఫ్ ఆరోతో కల్సి 1972లో అర్థశాస్త్రపు నోబెల్ బహుమతిని పొందినాడు. ఇతను అర్థశాస్త్రానికి చేసిన ప్రధాన సేవ IS-LMనమూనా. హిక్స్ మే 20, 1989 నాడు మరణించాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన జె.ఆర్.హిక్స్ ఏప్రిల్ 8, 1904 న ఇంగ్లాండు లోని లీమింగ్టన్ స్పాలో డొరోథీ కేధరీన్ (స్టీఫెన్స్), ఎడ్వర్డ్ హిక్స్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి స్థానిక వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేసేవాడు. [2] అతను క్లిఫ్టన్ కళాశాలలో(1917–1922)[3] విధ్యాభ్యాసం చేసాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో (1922–1926) ఇతని ఉన్నత విద్య కొనసాగింది. అతను గణితశాస్త్ర ఉపకార వేతనాలను పొందాడు. పాఠశాల రోజులలో, ఆక్స్‌ఫర్డు లో మొదటి సంవత్సరంలో అతను గణితశాస్త్రాన్ని ప్రత్యేక విషయంగా తీసుకున్నాడు. కానీ అతనికి సాహిత్యం, చరిత్ర పట్ల ఆసక్తి ఉండేది. 1923లో అతను తత్వశాస్త్రం, రాజనీతి, ఆర్థిక శాస్త్రాలలో తన విధ్యాభ్యాసాన్ని కొనసాగించాడు. అతను ద్వితీయ శ్రేణి గౌరవాలతో పట్టభద్రుడయ్యాడు. అతను చెప్పినట్లుగా, అతను చదివిన "ఏ సబ్జెక్టులోనైనా తగిన అర్హత లేదు"[4]
జీవితం
[మార్చు]1926 నుండి 1935 వరకు హిక్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో ఉపన్యాసాలు ఇచ్చాడు.[5] అతను కార్మిక ఆర్థికవేత్తగా ప్రారంభించాడు. పారిశ్రామిక సంబంధాలపై వివరణాత్మక కృషి చేసాడు కానీ క్రమంగా, అతను విశ్లేషణాత్మక వైపుకు వెళ్ళాడు. అక్కడ అతనికి గల గణిత నేపథ్యం తిరిగి తెరపైకి వచ్చింది. హిక్స్ పట్ల లియోనెల్ రాబిన్స్, ఫ్రెడరిక్ వాన్ హాయక్, R.G.D. అలెన్, నికోలస్ కల్డోర్, అబ్బా లెర్నర్ వంటి వారు ప్రభావితులైనారు.
1935 నుండి 1938 వరకు, అతను కేంబ్రిడ్జ్ లో ఉపన్యాసం ఇచ్చాడు. అతను ప్రధానంగా లండన్‌లో చేసిన మునుపటి రచన ఆధారంగా "వాల్యూ అండ్ కాపిటల్" గ్రంథాన్ని రాసాడు. 1938 నుండి 1946 వరకు మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అక్కడ, అతను సోషల్ అకౌంటింగ్‌కు అనువర్తితమైన సంక్షేమ ఆర్థిక శాస్త్రంపై తన ప్రధాన కృషిని చేసాడు.
1946 లో, అతను ఆక్స్‌ఫర్డుకు తిరిగి వచ్చాడు, మొదట నఫీల్డ్ కాలేజ్ (1946-1952) పరిశోధనా సహచరుడిగా, తరువాత డ్రమ్మండ్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ (1952-1965), చివరకు ఆల్ సోల్స్ కాలేజ్ (1965-1971) యొక్క పరిశోధనా సహచరుడిగా పనిచేసాడు. అతను పదవీ విరమణ తరువాత కూడా రచనలు రాయడం కొనసాగించాడు.
తరువాత జీవితం
[మార్చు]హిక్స్ 1964 లో లినాక్రే కాలేజీకి గౌరవ సహచరుడు అయ్యాడు. అతను 1972 లో ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతికి (కెన్నెత్ జోసెఫ్ ఆరోతో) సహ గ్రహీత. అతను 1973 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లైబ్రరీ అప్పీల్‌కు నోబెల్ బహుమతిని విరాళంగా ఇచ్చాడు. అతను 20 మే 1989 న కోట్స్‌వోల్డ్ గ్రామమైన బ్లాక్లీలోని తన ఇంటిలో మరణించాడు.[6] .
మూలాలు
[మార్చు]- ↑ The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 1972. Nobelprize.org. Retrieved on 28 July 2013.
- ↑ Creedy, John (2011). John and Ursula Hicks (PDF). Department of Economics, The University of Melbourne. ISBN 9780734044761.
- ↑ "Clifton College Register" Muirhead, J.A.O. p357: Bristol; J.W Arrowsmith for Old Cliftonian Society; April, 1948
- ↑ John R. Hicks – Biographical. Nobelprize.org (20 May 1989). Retrieved on 2013-07-28.
- ↑ "Sir John Hicks". London School of Economics. 13 March 2009. Archived from the original on 14 జూన్ 2012. Retrieved 8 July 2012.
- ↑ john hicks – British Academy Retrieved 15 January 2018.
బాహ్య లంకెలు
[మార్చు]- John Hicks page on the History of Economic Thought website.
- Commons category link is on Wikidata
- AC with 16 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1904 జననాలు
- 1989 మరణాలు
- ఆర్థిక శాస్త్రవేత్తలు
- ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు