జామా మసీదు (గోల్కొండ)
జామా మసీదు | |
---|---|
మతం | |
అనుబంధం | ఇస్లాం |
ప్రదేశం | |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
భౌగోళిక అంశాలు | 17°23′03″N 78°24′14″E / 17.384172°N 78.403787°E |
వాస్తుశాస్త్రం. | |
రకం | మసీదు |
స్థాపకుడు | సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ |
స్థాపించబడిన తేదీ | 1518 |
జామా మసీదు (సఫా మసీదు) తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండలో ఉన్న ఐదు శతాబ్దాల నాటి మసీదు.[1] మొదటి కుతుబ్ షాహి పాలకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో బహమనీ సుల్తానుల వద్ద గవర్నర్ గా ఉన్న సమయంలో 1518లో ఈ మసీదు నిర్మించారు.[2][3][4]
చరిత్ర
[మార్చు]1518 (924 హిజ్రీ)లో సుల్తాన్ కులీ కుతుబ్ షా (తరువాతికాలంలో మొదటి కుతుబ్ షాహి పాలకుడు) బహమనీ సుల్తాన్ మహమూద్ షా బహమనీ II దగ్గర తెలంగాణ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్నప్పుడు గోల్కొండ కోటను పునర్నిర్మించారు. అదే సంవత్సరం ఆ నగరానికి ముహమ్మద్ నగర్ అని పేరు కూడా పెట్టారు. ఆ ప్రాంతంలో "సఫా మసీదు" పేరుతో ఒక మసీదును నిర్మించడంతోపాటు తరువాతికాలంలో దానిని జామా మసీదు అని పిలిచారు. 1543లో సుల్తాన్ కులీ వారసుడు జంషీద్ కులీ కుతుబ్ షా చెప్పుడుమాటలతో గోల్కొండ కోట క్విలాదార్ మీర్ మహ్మద్ హమదానీ ప్రార్థనలలో ఈ మసీదులో సుల్తాన్ కులీ హత్య చేయబడ్డాడు.[5][6]
ఆర్కిటెక్చర్
[మార్చు]బహమనీల కాలంలో హైదరాబాద్‌లో బహమనీ శైలిలో నిర్మించిన ఏకైక మసీదు ఇది. మసీదు ప్రవేశ ద్వారంపై ఒకే గోపురం ఉంటుంది. మసీదు లోపల గ్రానైట్ స్లాబ్‌లతో చదునుగా చేయబడింది. ఒక పెద్ద గది నాలుగు నడవలు, ఐదు తోరణాలతో విభజించబడింది.[7][5][8]
మూలాలు
[మార్చు]- ↑ Sur, Aihik (10 January 2019). "Illegal construction damaging Hyderabad's oldest mosque". The New Indian Express. Archived from the original on 21 అక్టోబరు 2021. Retrieved 21 October 2021.
- ↑ Nanisetti, Serish (2020-02-11). "Golconda's identity gets marred again". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 October 2021.
- ↑ Nanisetti, Serish (2016-07-13). "Masjid marred by a new minaret". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 October 2021.
- ↑ Ifthekhar, J. S. "Architectural marvels of spirituality". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 October 2021.
- ↑ 5.0 5.1 Bilgrami, Syed Ali Asgar (1992). Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains of the City and Suburbs of Hyderabad. Asian Educational Services. pp. 108–112. ISBN 9788120605435. Retrieved 21 October 2021.
- ↑ Matsuo, Ara (22 November 2005). "Golconda". University of Tokyo. Retrieved 21 October 2021.
- ↑ Nanisetti, Serish (2018-03-10). "Golconda fort marks 500 years, inconspicuously". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 October 2021.
- ↑ Nayeem, M. A (2006). The Heritage of the Qutb Shahis of Golconda and Hyderabad. Vol. I. University of Michigan Press. p. 320. ISBN 9788185492230.