Jump to content

జాయ్ కాళీ దేవాలయం

వికీపీడియా నుండి
జాయ్ కాళీ దేవాలయం
భౌగోళికం
దేశంబంగ్లాదేశ్ బంగ్లాదేశ్
సంస్కృతి
దైవంకాళీ మాత

జాయ్ కాళీ దేవాలయం (బెంగాలీ: জয় কালী মন্দির) బంగ్లాదేశ్‌లో గల ఢాకాలోని థాథారి బజార్ లో ఉంది. ఇది కాళీ మాతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయంలో కాళీ దేవిని పూజించడానికి అన్ని వయస్సుల వారు వస్తారు. ఇక్కడి కాళీ మాత విగ్రహం హిందువులకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. ఈ ఆలయ సందర్శకులు, కమిటీ సభ్యులు భక్తితో డబ్బు జమ చేసి, అక్కడ వారికి ప్రసాదం పంచిపెడతారు.

చరిత్ర

[మార్చు]

ఈ ఆలయం దాదాపు 400 సంవత్సరాల పురాతనమైనది, దాదాపు 1001వ సంవత్సరంలో స్థాపించబడింది. నవాబుల పాలనలో, దీవాన్ తులసీ నారాయణ్ ఘోష్, నభ్ నారాయణ ఘోష్ ఈ ఆలయాన్ని బంచారాం సేథ్ తనిఖీతో స్థాపించారు. ఆ సమయంలో వారు షిబ్, కాళి, లక్ష్మీనారాయణ, త్రి శాల్గ్రామ్ చక్ర, బాండుర్గ మొదలైన ఇరవై ఒక్క విగ్రహాలను స్థాపించారు. పంచరత్న, నబ్రత్న, శివాలయం, అతిథి గృహం వంటి కొన్ని అందమైన స్మారక కట్టడాలు జాయ్ కాళిలో నిర్మించబడ్డాయి. కలిగంజ్ కు దక్షిణాన ఉన్న మార్కెట్కు నవాబ్‌పూర్ జాయ్ కాళీ బజార్ అని పేరు పెట్టారు. ఇది కాళీ దేవికి అంకితం చేయబడింది. దేవతల చరిత్రను ప్రతిబింబించే మందపాటి గోడలను, నిలువు వరుసలతో ఆలయాన్ని మూడు లీనియర్ స్పేసులుగా విభజించవచ్చు. గర్భ ఘృహ అనే దేవుని ప్రదేశాన్ని కేంద్రీకరించడానికి అన్ని ప్రదేశాలు తెరవబడి ఉంటాయి.

ప్రస్తుత పరిస్థితి

[మార్చు]

ప్రస్తుతం ఈ ఆలయం దాదాపు 300.64 చదరవు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ జాయ్ కాళీ ఆలయానికి మొదటి పూజారి బంచారాం సేథ్, మూడవ పూజారి పనచేనంద్. ఈ ఆలయంలో సేవ చేసే బాధ్యత వంశపారంపర్యంగా జరిగింది. బ్రాహ్మణ పూజారులు రామ్ జగన్నాథ్ చక్రవర్తి, కృష్ణ చంద్ర చక్రవర్తి, అబోనిమోహన్ చక్రవర్తి వంటి వారు పూజారులుగా ఉన్నారు. ఈ వంశంలో చివరి పూజారి ఖితీష్ చంద్ర చక్రవర్తి. ఇతను క్యాన్సర్ కారణంగా 1977లో కన్నుమూశాడు. అప్పటి నుండి ఆలయం నిర్వహణ బాధ్యతలు ఎవరూ తీసుకోలేకపోవడం, డబ్బు కొరత కారణంగా క్రమంగా ఆలయం క్షీణించడం ప్రారంభించింది. ఈ ఆలయం 1990 సమయంలో పూర్తిగా దెబ్బతిన్నది. తరువాత కాళీ దేవి భక్తులచే ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ప్రస్తుత ఆలయం మొదట స్థాపించబడినప్పటి కంటే చాలా చిన్నగా మారింది. 2010లో ఆలయంలో చోరీకి గురై విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారు.[1]

నిర్మాణ ప్రాముఖ్యత

[మార్చు]

ఈ ఆలయ సరిహద్దులో ప్రధానంగా రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి కాళీ దేవి, మరొకటి శివుడి ఆలయాలు. ఆలయ గోడలపై హిందూ దేవుళ్లు, దేవతల చిత్రాలు ముద్రించబడ్డాయి. ఆలయ ప్రవేశం దగ్గర స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన లోగో 'ఓం' అని స్వాగతం పలుకుతుంది- ఇది హిందూ దైవిక చిహ్నం. కాళీ దేవి విగ్రహం ముందు ఒక గంట పై నుండి వేలాడుతూ ఉంటుంది, ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత, బయలుదేరే ముందు గంటను మోగించడం ఒక ఆచారం. ఈ ఆలయాలలు ఒకటి ఉత్తర ముఖంగా, మరొకటి తూర్పు ముఖంగా ఉంటాయి. దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉండి, దాని కుడి వైపున పవిత్ర తులసి తోట ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "Hindu temple burgled in Dhaka". Hindustan Times,Delhi – via HighBeam Research (subscription required) . 3 February 2011. Archived from the original on 14 July 2014. Retrieved 3 September 2012.