Jump to content

జావేద్ ఖాన్ అమ్రోహి

వికీపీడియా నుండి
జావేద్ ఖాన్ అమ్రోహి
జననం(1962-03-24)1962 మార్చి 24
ముంబై, భారతదేశం
మరణం2023 ఫిబ్రవరి 14(2023-02-14) (వయసు 60)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1973–2023

జావేద్ ఖాన్ అమ్రోహి (1962 మార్చి 24 - 2023 ఫిబ్రవరి 14) భారతీయ చలనచిత్రం, టెలివిజన్ నటుడు. ఆయన నటనా జీవితాన్ని 1970లలో థియేటర్‌లో ప్రారంభించి, ఆపై సినిమాల్లో నటించాడు. ఆయన హిందీలో దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించాడు. 2001లో లగాన్‌ చిత్రానికి గానూ ఆయన అకాడమి అవార్డుకు నామినేట్‌ అవ్వడం విశేషం.

బాల్యం

[మార్చు]

జావేద్ ఖాన్ అమ్రోహి ముంబైలో 1962 మార్చి 24న జన్మించాడు.

కెరీర్

[మార్చు]

అతను జల్తే బదన్ (1973) చిత్రంతో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. మ1970లు, 1980లలో సహాయక పాత్రలు పోషించడం కొనసాగించాడు, ఆషికి, సత్యం శివం సుందరం, వో 7 దిన్, త్రిదేవ్, ఆషికి వంటి అనేక చిత్రాలలో నటనకు మంచి గుర్తింపు పొందాడు. అలాగే అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడిన చిత్రం లగాన్: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా (2001), అందాజ్ అప్నా అప్నా (1994), చక్ దే! ఇండియా (2007) తదితర చిత్రాల్లో జావేద్ ఖాన్ అమ్రోహి పోషించిన పాత్రలకు విశేష ప్రేక్షకాదరణ లభించింది.

ఆయన గుల్జార్ దర్శకత్వం వహించిన మీర్జా గాలిబ్ వంటి టీవీ ధారావాహికలలో, 1980లలో సయీద్ అక్తర్ మీర్జా దర్శకత్వం వహించిన నుక్కడ్‌లో కరీం (మంగలి) పాత్రలో నటించాడు. ఆయన ముంబైలోని జీ టీవీ వారి జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్‌లో యాక్టింగ్ ఫ్యాకల్టీ సభ్యుడు కూడా.

మరణం

[మార్చు]

కొంతకాలం శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ 60 ఏళ్ల జావేద్‌ ఖాన్‌ అమ్రోహీ చికిత్స పొందుతూ ముంబయిలోని ఓ ఆస్పత్రిలో 2023 ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Javed Khan Amrohi: చిత్ర పరిశ్రమలో విషాదం.. 'లగాన్‌' నటుడు మృతి". web.archive.org. 2023-02-14. Archived from the original on 2023-02-14. Retrieved 2023-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)