జిడెబి
స్వరూపం
GNOMEపై జీడెబి | |
మూలకర్త | మైకేల్ వోట్ |
సరికొత్త విడుదల | 0.8.5 |
ప్రోగ్రామింగ్ భాష | పైథాన్ |
నిర్వహణ వ్యవస్థ | లినక్స్ |
ఆభివృద్ది దశ | క్రియాశీల అభివృద్ధి |
లైసెన్సు | జీపీయల్ |
జిడెబి(GDebi) అనేది డెబియన్/ఆధారిత నిర్వాహక వ్యవస్థలలో అప్రమేయ ప్యాకేజీ ఆకృతిలో ఉండే .deb దస్త్రాలను స్థాపించుటకు రూపొందించిన పనిముట్టు. ఇది రేఖాచిత్ర అంతరవర్తిలో అందుబాటులో ఉండటం వలన ఆదేశ పంక్తి ద్వారా ప్యాకేజీ నిర్వహణ కష్టంగా భావించేవారు దీనిని ఉపయోగించవచ్చు. అయితే ఇది ఆదేశ పంక్తి (కమాండ్ లైన్) ద్వారా కూడా పనిచేస్తుంది. జిడెబితో స్థానికంగా వ్యవస్థలోకి దింపుకున్న .deb దస్త్రాలను స్థాపించవచ్చు, అంతేకాక స్థాపనకు ఏవైనా అదనంగా అవసరమైన ప్యాకేజీలను స్వయంగా దింపుకుని స్థాపిస్తుంది.