Jump to content

జితేందర్ కౌర్ అరోరా

వికీపీడియా నుండి
జితేందర్ కౌర్ అరోరా
జననం
జితేందర్ కౌర్ అరోరా

(1934-10-05) 1934 అక్టోబరు 5 (వయసు 90)
జాతీయతభారతీయులు
వృత్తిమహిళా శాస్త్రవేత్తలు

జితేందర్ కౌర్ అరోరా మైక్రోబయాలజీ రంగంలో శాస్త్రవేత్త. పంజాబ్ లో జన్మించారు. ఉన్నత చదువుల అనంతరం "మహిళల ప్రగతి పథంలో సైన్స్ అండ్ టెక్నాలజీ" అనే అంశం మీద పరిశోధన చేసి పి.హెచ్.డి సాధించారు. ఈమె వెలువరించిన పరిశోధనా గ్రంథానికి "నేషనల్ అవార్డ్" లభించింది. ఈ జాతీయ స్థాయి అవార్డును పొందిన తొలి భారతీయ పరిశోధకురాలుగా ఘన కీర్తినార్జించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

డాక్టర్ జితేందర్ కౌర్ విద్యార్థిని దశనుంచే మేథోపరిణితితో పాటు సృజనాత్మకతను సంతరించుకుంది. డిగ్రీ విద్యలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు ఉత్తమస్థాయి విద్యార్థినిగా పలు అవార్డులు అందుకున్నారు. మైక్రో బయాలజీ రంగంలో పేరు ప్రతిష్ఠలు పొందిన మొట్టమొదటి మహిళగా కూడా గుర్తింపు పొందారు.

2009 లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వారి స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు డైరక్టరుగా నియమితులైనారు. ఈమె తన పదవికి మరింత రాణింపు తీసుకురావడానికి తన పరిశోధనా ఫలాలను గ్రామీణ మహిళల ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయడానికి అవిరళ కృషి చేస్తున్నారు. మన దేశంలో అనాదిగా మూలికా వైద్యానికి ఎంతో ఆదరణ ఉంది. దేశంలో 7500 రకాల ఔషధ మొక్కలను గుర్తించినా, ఈ నాటికి 1500 రకాల మొక్కలను మాత్రమే వైద్య చికిత్సకు వాడుతున్నారు. మూలికా వైద్యంతో పాటు ఆయుర్వేదం, అల్లోపతి మందుల్లో సైతం ఔషధ మొక్కలు, వాటి ఉత్పత్తులను వినియోగించడం మీద డాక్టర్ జితేందర్ కౌర్ దృష్టి సారించారు.

ఆమె రాష్ట్ర మహిళలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఎన్వినాన్‌మెంట్ ఫ్రెండ్లీ ఎరువుల తయారీ వాడకం మిద రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టుకు ప్రాజెక్టు ఆఫీసరుగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈమె పరిశోధనా కృషి గ్రామీణ ప్రజలకు అందుబాటులోనికి రావడంతో, యువ మహిళా శాస్త్రవేత్తలకు ఆదర్శప్రాయంగా నిలిచారు

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]