జిమ్మీ క్రుగర్
జిమ్మీ క్రుగర్ | |
---|---|
In office 19 జూన్ 1979 – 31 డిసెంబర్ 1980 | |
అధ్యక్షుడు | జాన్ వోర్స్టర్ మరైస్ విల్జోయెన్ |
ప్రధాన మంత్రి | పి.డబ్ల్యు.బోథా |
అంతకు ముందు వారు | మరైస్ విల్జోయెన్ |
తరువాత వారు | స్థానం రద్దు చేయబడింది కోబీ కోయెట్సీ (1994) |
వ్యక్తిగత వివరాలు | |
జననం | జేమ్స్ థామస్ క్రుగర్ 20 డిసెంబర్ 1917 బెత్లెహెం , ఆరెంజ్ ఫ్రీ స్టేట్ , సౌత్ ఆఫ్రికా |
మరణం | 9 మే 1987 ఐరీన్ , ట్రాన్స్‌వాల్ , దక్షిణాఫ్రికా |
రాజకీయ పార్టీ | నేషనల్ పార్టీ (1962–1980) |
ఇతర రాజకీయ పదవులు | కన్జర్వేటివ్ పార్టీ (1982–1987) |
జీవిత భాగస్వామి | సుసాన్ క్రుగర్ |
సంతానం | యూజీన్ ఈటెల్ |
కళాశాల | విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయం |
వృత్తి | రాజకీయ నాయకుడు, న్యాయవాది |
జేమ్స్ థామస్ క్రుగర్ (20 డిసెంబర్ 1917 - 9 మే 1987 )[1] దక్షిణాఫ్రికా-జన్మించిన రాజకీయ నాయకుడు,అతను వర్ణవివక్షను సమర్థించిన సంప్రదాయవాద నేషనల్ పార్టీ ప్రభుత్వంలో భాగం.అతను 1974 నుండి 1979 వరకు ప్రధాన మంత్రి జాన్ వోర్స్టర్ క్యాబినెట్‌లో న్యాయ, పోలీసు మంత్రిగా చేశాడు. అతను 1979 నుండి 1980 వరకు సెనేట్‌కు అధ్యక్షుడిగా కూడా చేశాడు.
నేపథ్యం
[మార్చు]క్రూగర్ వెల్ష్ [2] దక్షిణాఫ్రికాలోని ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌లోని బెత్లెహెమ్‌లో జన్మించాడు ఆఫ్రికనేర్ తల్లిదండ్రులు ఇతన్ని దత్తత తీసుకున్నారు. అతను వెంటర్స్‌డోర్ప్‌లోని ఒక ఉన్నత పాఠశాల నుండి తన మెట్రిక్‌ని చదువు పూర్తి చీశాడు.తర్వాత మైనింగ్ సర్వేయర్‌గా పరీక్ష రాసే ముందు బ్రాక్‌పాన్‌లోని బంగారు గనిలో సర్వేయర్‌గా శిక్షణ పొందాడు .అప్పుడు అతను బార్బర్టన్‌లో సర్వేయర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.
విద్య
[మార్చు]క్రూగర్ యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (UNISA) నుండి ఆఫ్రికన్ లో డిగ్రీ పట్టా కోసం పార్ట్-టైమ్లో తన చదువు కొనసాగించాడు ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ ది విట్వాటర్‌రాండ్‌లో చదివాడు, 1954లో అతను అందులో న్యాయవాద పట్టా పొందాడు.1955లో తను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]1962లో ట్రాన్స్‌వాల్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యుడిగా మారాడు. నేషనల్ పార్టీ అభ్యర్థిగా, అతను 1966 నుండి దక్షిణాఫ్రికా పార్లమెంటులో హౌస్ ఆఫ్ అసెంబ్లీ సభ్యుడు అయ్యాడు.1972లో, క్రుగర్ పోలీసు, ఆరోగ్యం , సంక్షేమ శాఖలో డిప్యూటీ క్యాబినెట్ మంత్రిగా నియమించబడ్డాడు.1974లో అతను పోలీసు, జైళ్లు ,న్యాయ శాఖకు పూర్తి మంత్రిగా పదోన్నతి పొందాడు. జూన్ 1979లో, సెనేట్ ప్రెసిడెంట్ గా లాంఛనప్రాయ పదవి చేపట్టాడు కానీ 1980లో సెనేట్ రద్దు చేయబడినప్పుడు పదవీ విరమణ చేశారు. [3]