జిల్లేడు (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
- జిల్లేడు, ఒక మందు మొక్క.జిల్లేడు లేదా అర్క (లాటిన్ Calotropis) ఒక పాలుగల చిన్న మందు మొక్క. జిల్లేడులో మూడు జాతులు గలవు. 1. తెల్లజిల్లేడు, 2. ఎర్రజిల్లేడు, 3. రాజుజిల్లేడు.
లక్షణాలు
[మార్చు]- చెట్టంతా కొంచెము మదపు వాసన కలిగియుండును.
- వేరు పొడవుగా నుండును. వేరు పైన గల చర్మము కూడా తెల్లని పాలు కలిగియుండును.
- దూది వంటి నూగుతో కప్పబడిన శాఖలతో పెరిగే చిన్నపొద. 2-3 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.
- అండాకారం నుండి హృదయాకారంలో ఉన్న దళసరిగా పాలు కలిగిన సరళ పత్రాలు. క్రిందిభాగమున ఈనెలుకలిగి, తెల్లని నూగుకలిగి ఉంటాయి.
- పార్శ్వ్ అగ్రస్థ నిశ్చిత సమశిఖి విన్యాసంలో అమరి ఉన్న తెలుపు లేడా గులాబీ రంగుతో కూడిన కెంపు రంగు పుష్పాలు. ఇవి గుత్తులు గుత్తులుగా పూయును.
- కొడవలి ఆకారంలో ఉన్న జంట ఏకవిదారక ఫలాలు. పండి పగిలిన అందులో తెల్లని మృదువైన దూది యుండును.
జాతులు
[మార్చు]- ఎర్ర జిల్లేడు (Calotropis gigantea)
- తెల్ల జిల్లేడు (Calotropis procera)
- రాజు జిల్లేడు
హిందువులు
[మార్చు]- రథసప్తమి రోజు జిల్లేడు పత్రాలు ధరించి నదీస్నానము చేస్తే చాలా పుణ్యమని హిందువుల నమ్మకం.
- వినాయక చవితి రోజు జిల్లేడు ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.
గ్యాలరీ
[మార్చు]-
Flowers in Hyderabad, India.
-
Leaves & flowers in Hyderabad, India.