జి.ఎస్. లక్ష్మణ్ అయ్యర్
జి.ఎస్. లక్ష్మణ్ అయ్యర్ | |
---|---|
జననం | జి.ఎస్. లక్ష్మణన్ 1918 గోబిచెట్టిపాలేయం, తమిళనాడు |
మరణం | 2011 |
సమాధి స్థలం | గోబిచెట్టిపాలేయం, తమిళనాడు |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత స్వాతంత్ర్య సమరయోధుడు |
జి.ఎస్. లక్ష్మణ్ అయ్యర్ (1918 - 2 జనవరి 2011) తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
జీవిత విషయాలు
[మార్చు]లక్ష్మణ్ అయ్యర్ 1918లో తమిళనాడులోని గోబిచెట్టిపాలేయంలో జన్మించాడు.
ఉద్యమ జీవితం
[మార్చు]భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న లక్ష్మణ్ అయ్యర్ ఐదేళ్ళకుపైగా జైలులో ఉన్నాడు. పేదలు, అణగారిన వర్గాల అభివృద్ధికోసం ఎంతగానో కృషిచేశాడు, తన ఆస్తులలో ఎక్కువ భాగాన్ని పేదలకు దానం చేశాడు.[1] ఇళ్ళు నిర్మించడానికి తన విలువైన భూమిని పంపిణీ చేశాడు.[2] ఇతని భార్య కూడా సత్యాగ్రహంలో పాల్గొని, ఇతనితోపాటు జైలు శిక్షను అనుభవించింది.
రాజకీయ జీవితం
[మార్చు]లక్ష్మణ్ అయ్యర్ రెండుసార్లు గోబిచెట్టిపాలెం మున్సిపాలిటీ చైర్మన్ (1952-1955, 1986-1991)గా పనిచేశాడు.[3] అతడికాలంలో భారతదేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థను నిషేధించిన మొట్టమొదటి నగరంగా గోబిచెట్టిపాలెం నిలిచింది.[4] దళితులను అప్పుల నుండి విడిపించి, వారు శుభ్రమైన, విశాలమైన వీధుల్లో సౌకర్యవంతమైన ఇళ్ళలో నివసించేలా, ఆధునిక మరుగుదొడ్లను నిర్మించేలా చేశాడు.
మరణం
[మార్చు]లక్ష్మణ్ అయ్యర్ తన 93 సంవత్సరాల వయస్సులో అనారోగ్యం కారణంగా 2011, జనవరి 2న మరణించాడు.
గౌరవం
[మార్చు]లక్ష్మణ్ అయ్యర్ మృతికి వేలాది మంది ప్రజలు నివాళులు అర్పించారు. లక్ష్మణ అయ్యర్ జీవితం గురించి రచయిత ఎస్. బాలమురుగన్ "ఓయమారి" అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించాడు.[5] 2018లో తమిళనాడు గవర్నర్ జిఎస్ లక్ష్మణ్ అయ్యర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "லட்சுமண அய்யர் எனும் சாதி ஒழிப்புப் போராளி". The Hindu - Tamil. 22 February 2016. Retrieved 5 October 2021.
- ↑ "எழுதித் தீராத பெருவாழ்வு". Kalachuvadu - Magazine. February 2011. Archived from the original on 5 జనవరి 2018. Retrieved 5 October 2021.
- ↑ "Gobichettipalayam - Overview". Gobichettipalayam. Archived from the original on 29 సెప్టెంబరు 2017. Retrieved 5 October 2021.
- ↑ "Magsaysay winner Bezwada Wilson: It's been a long journey, slow progress". OneIndia-News. 28 July 2016. Retrieved 5 October 2021.
- ↑ Kannadasan, Akila (2012-01-25). "Remembering a great man". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 5 October 2021.
- ↑ India, Press Trust of (2018-08-29). "TN Guv urges people to lead simple life". Business Standard India. Retrieved 5 October 2021.
- ↑ "Lakshmanan Iyer, the Gandhian from Tamil Nadu who gave away all his land". ETV Bharat News. Retrieved 5 October 2021.