Jump to content

జి.ఎస్. లక్ష్మి

వికీపీడియా నుండి
జి.ఎస్. లక్ష్మి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గండికోట సర్వలక్ష్మి[1]
పుట్టిన తేదీ (1968-05-23) 1968 మే 23 (వయసు 56)
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్
మారుపేరులక్ష్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1985/86–1990/91బీహార్
1993/94–1999/00సౌత్ జోన్
1999/00ఆంధ్ర
2000/01–2002/03రైల్వేలు
2000/01కర్ణాటక
మూలం: CricketArchive, 2022 జనవరి 15

గండికోట సర్వలక్ష్మి భారత క్రికెట్ మ్యాచ్ రిఫరీ, మాజీ దేశీయ క్రికెట్ క్రీడాకారిణి, కోచ్.[2] ఆమె కుడిచేతి వాటం బ్యాటరు, కుడిచేతి ఫాస్ట్-మీడియం అవుట్‌స్వింగ్ బౌలరు.[3]

2019 మే 14 న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారి ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్‌లో నియమితులైన మొదటి మహిళగా లక్ష్మి నిలిచింది [4][5] ఆమె రిఫరీగా వ్యవహరించిన మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది.

జీవితం తొలి దశలో

[మార్చు]

లక్ష్మి 1968 మే 23న ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె జంషెడ్‌పూర్‌లో పెరిగింది. అక్కడ ఆమె తండ్రి టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (ఇప్పుడు టాటా మోటార్స్ ) లో పనిచేశాడు. లక్ష్మి టాటా నగర్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె 1986లో 10వ తరగతి పరీక్షలలో ఆమె సాధించిన "దారుణమైన మార్కుల" కారణంగా జంషెడ్‌పూర్ మహిళా కళాశాలలో ప్రవేశం దొరకలేదు. అయితే, కళాశాల స్పోర్ట్స్ కోటా కోసం ప్రయత్నించమని తండ్రి ఆమెకు సలహా ఇచ్చాడు. ఆ విధంగా ఆమె జంషెడ్‌పూర్ మహిళా కళాశాలలో ప్రవేశం పొందింది. ఆమె దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం సంపాదించిన తర్వాత 1989లో హైదరాబాద్‌కు తరలివెళ్లింది. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే క్రికెట్ జట్టుకు ఆడటం ప్రారంభించింది.[6][7]

కెరీర్

[మార్చు]

లక్ష్మి 1989, 2004 మధ్య ఆంధ్ర మహిళలు, బీహార్ మహిళలు, రైల్వేస్ మహిళలు, ఈస్ట్ జోన్ మహిళలు, సౌత్ జోన్ మహిళా జట్లతో సహా పలు దేశీయ జట్లకు ఆడింది. ఆమెకు 1991లో వివాహమైంది. తన పెళ్లి రోజునే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో చేరమని పిలుపు అందుకుంది. అయితే క్రికెట్ నుండి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. దక్షిణ మధ్య రైల్వే జట్టుతో ఆమె మళ్ళీ క్రికెట్‌లో ప్రవేశీంచింది. 1995లో మొదటిసారిగా ఇంటర్-రైల్వేస్ టైటిల్‌ను గెలుచుకోవడంలో జట్టుకు తోడ్పడింది. ఆమె 1999లో భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు జట్టులో ఎంపికైంది గానీ, పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లక్ష్మి 2004లో క్రికెట్‌ నుండి రిటైరైంది [6][7]

పదవీ విరమణ తర్వాత లక్ష్మి, 2014 వరకు దక్షిణ మధ్య రైల్వే జట్టుకు కోచ్‌గా పనిచేసింది.[6] ఆమె తొలిసారిగా 2008-09 సీజన్‌లో దేశవాళీ మహిళల క్రికెట్‌లో మ్యాచ్ రిఫరీగా వ్యవహరించింది.[8] బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) దేశీయ క్రికెట్‌లో మొదటిసారిగా మహిళా రిఫరీలను అనుమతించిన తర్వాత ఆ సీజన్‌లో రంగప్రవేశం చేసిన ఐదుగురు మహిళా రిఫరీల బృందంలో ఆమె కూడా ఉంది. ఈ ఐదుగురిలో భారత జాతీయ జట్టుకు ఆడనిది లక్ష్మి ఒక్కరే. 2014లో మ్యాచ్ రిఫరీల కోసం బీసీసీఐ అర్హత పరీక్ష ద్వారా ఎంచిన ఐదుగురు మహిళా అభ్యర్థుల్లో ఆమె కూడా ఉంది. తదనంతరం, బాలుర, పురుషుల దేశీయ ఆటలను నిర్వహించేందుకు ఆమెకు అనుమతి లభించింది. అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్, బెంగాల్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్ష్మి తన మొదటి కోడ్-ఆఫ్-కాండక్ట్ పెనాల్టీని జారీ చేసింది.[6] BCCI ఆమెను 2018లో ICC ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్‌లో నియమించాలని సిఫార్సు చేసింది.[9]

2019 మహిళల T20 ఛాలెంజ్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లక్ష్మి మ్యాచ్ రిఫరీగా ఉన్నారు.[6] 2019 మే 14 న ICC ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్‌లో నియమితులైన మొదటి మహిళగా లక్ష్మి నిలిచింది [10][11] 2019 అక్టోబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2019 ICC T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం ఎంపిక చేసిన ముగ్గురు మ్యాచ్ రిఫరీలలో లక్ష్మి ఒకరు. ఆ విధంగా, ఓ ఐసిసి ఈవెంట్‌లో రిఫరీగా ఎంపికైన మొట్ట మొదటి మహిళగా నిలిచింది.[12] 2019 డిసెంబరులో ఆమె 2019 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ట్రై-నేషన్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌కు మ్యాచ్ రిఫరీగా ఎంపికై, పురుషుల వన్‌డే మ్యాచ్‌ను పర్యవేక్షించిన మొదటి మహిళగా నిలిచింది.[13]

మూలాలు

[మార్చు]
  1. Das, AuthorN Jagannath. "Lakshmi becomes ICC match referee". Telangana Today. Retrieved 9 June 2019.
  2. "GS Lakshmi becomes first woman to be ICC match referee". ESPNcricinfo (in ఇంగ్లీష్). 14 May 2019. Retrieved 15 May 2019.
  3. "GS Lakshmi". Cricinfo. Retrieved 15 May 2019.
  4. "ICC welcomes first female match referee and boosts numbers on development panel". ICC (in ఇంగ్లీష్). Retrieved 15 May 2019.
  5. "పురుషుల వన్డేకు మహిళా మ్యాచ్‌ రిఫరీ". Sakshi. 2019-12-06. Archived from the original on 2021-01-16. Retrieved 2023-09-13.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "'I want to officiate in Women's World Cup final' - GS Lakshmi". ESPNcricinfo (in ఇంగ్లీష్). 14 May 2019. Retrieved 15 May 2019.
  7. 7.0 7.1 Subrahmanyam, V. V. "'Its a special feeling' says Suvarna Lakshmi after becoming ICC's first female match referee". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 15 May 2019.
  8. "India's GS Lakshmi becomes first female ICC match referee - Times of India". The Times of India. Retrieved 15 May 2019.
  9. "Pitch Perfect: From player to referee, AP's Lakshmi first woman to be on ICC panel". The Times of India. Retrieved 9 June 2019.
  10. "GS Lakshmi is first woman on ICC international panel of match referees". BBC. 14 May 2019. Retrieved 15 May 2019.
  11. "ICC Appoints India's GS Lakshmi as First-ever Female Match Referee". News18. 14 May 2019. Retrieved 15 May 2019.
  12. "Match Officials announced for ICC Men's T20 World Cup Qualifier 2019". International Cricket Council. Retrieved 10 October 2019.
  13. "GS Lakshmi set to become first woman referee to oversee men's ODI". Women's CricZone. Retrieved 5 December 2019.