జి.వి.కె రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గునుపాటి వెంకట కృష్ణారెడ్డి
G V Krishna Reddy (Horasis Global India Business Meeting 2010).jpg
హొరాసిస్ గ్లోబల్ ఇండియా బిజినెస్ మీటింగ్ 2010 లో జివి కృష్ణారెడ్డి G. V. Krishna Reddy at Horasis Global India Business Meeting, 2010.
జననం (1937-03-22) 1937 మార్చి 22 (వయస్సు 85)
కొత్తూరు, నెల్లూరు జిల్లా
జాతీయతభారతీయుడు
వృత్తిజివికె గ్రూపు వ్యవస్థాపక చైర్మన్,మేనేజింగ్ డైరెక్టరు
పురస్కారాలుపద్మ భూషణ్ (2010)

గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, జివికె గ్రూపుకు వ్యవస్థాపక చైర్మను, మేనేజింగ్ డైరెక్టరు.[1] ఆయన డాక్టర్ జివికె రెడ్డిగా సుపరిచితుడు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల గ్రూపు ఇది. అతను భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర విద్యుత్ ప్లాంట్‌ను 1997 లో ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించాడు. [2]

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడల్‌లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిన మొదటి వ్యక్తి జివికె. ముంబై, చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం లోని కొత్త ఐకానిక్ రెండవ టెర్మినల్ ను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించాడు. ఇది జివికె ముఖ్యమైన విజయాల్లో ఒకటి. భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ కళా ప్రదర్శన (జయ హే) - 3 కిలోమీటర్ల బహుళ్ అంతస్థుల కళా కుడ్యం ఈ టర్మినల్లో ప్రత్యేక అకర్షణ. ఇందులో మహారాష్ట్రకు, దేశం లోని ఇతర ప్రాంతాలకూ చెందిన్ 7050 కి పైగా కళాకృతులు, కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం జివికె విజయాల్లో మరొకటి. [3]

జీవిత విశేషాలు[మార్చు]

జివి కృష్ణారెడ్డి 1937 మార్చి 22 న ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో జన్మించాడు. అతను కొత్తూరు ప్రాథమిక పాఠశాల లోను, నెల్లూరులో ప్రారంభ కళాశాల చదువు చదివి, హైదరాబాద్ నుండి పట్టభద్రుడయ్యాడు. [4] తరువాత అతను అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఓనర్ / ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ (OPM) కోర్సు చదివాడు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జివికె రెడ్డికి "డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ" అనే గౌరవ బిరుదును ప్రదానం చేసింది. [5]

రెడ్డి క్రీడల్లో అభిరుచి వ్యక్తి. వర్ధమాన యువ క్రీడా ప్రతిభను నిరంతరం ప్రోత్సహిస్తూంటాడు. డాక్టర్ రెడ్డి హైదరాబాద్‌లో యువత కోసం టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేశారు. [6]

వ్యాపార వృత్తి[మార్చు]

నాగార్జున సాగర్ కుడి కాలువ నిర్మాణంతో కృష్ణారెడ్డి వ్యాపారంలోకి ప్రవేశించాడు.

ఫోర్ స్టార్ హోటల్ అయిన హోటల్ బంజారాలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుని దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. 1976-77 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసాడు. హాలిడే ఇన్ సహకారంతో అతను ఆతిథ్య వ్యాపారంలోకి ప్రవేశించాడు. అతను నోవోపాన్ ఇండియా లిమిటెడ్‌ను స్థాపించాడు. సాదా, మెలమైన్ ఫేస్‌డ్ పార్టికల్ బోర్డులను తయారు చేయడానికి ప్రీ-లామినేటెడ్ పార్టికల్ బోర్డ్ టెక్నాలజీని భారతదేశానికి తీసుకువచ్చిన మొట్టమొదటి సంస్థ అది. [7]

పురస్కారాలు, సత్కారాలు[మార్చు]

 • పద్మ భూషణ్ - 2011. భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం. [8]
 • "నిర్మాణ ప్రపంచం   - కన్స్ట్రక్షన్ వరల్డ్ చేత మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2011 అవార్డు. [9]
 • సిఎన్‌బిసి-టివి 18 నెలకొల్పిన ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డుల క్రింద "బెస్ట్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2010" అవార్డు. [10]
 • ఎకనామిక్ టైమ్స్ నుండి "ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2009" [11]
 • అతని నాయకత్వంలోని జివికె కెపిఎంజి చేత "మోస్ట్ ప్రామిసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది.
 • మలేషియా తెలుగు అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో జరిగిన అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక సదస్సులో ఎక్సలెన్స్ అవార్డు.
 • ది తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, యు.ఎస్.
 • చెన్నైలోని ప్రపంచ తెలుగు సమాఖ్య యొక్క జీవిత సభ్యత్వం. [12]

మూలాలు[మార్చు]

 1. "GVK Reddy: many firsts to his credit". The Hindu. 26 January 2011. Retrieved 19 May 2012.
 2. Amirapu, Sai Deepika (1 December 2008). "GVK Power's hydro project to go on stream before schedule". The Economic Times. Retrieved 12 July 2013.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-05. Retrieved 2020-06-30.
 4. Hema Ramakrishnan, Deepika Amirapu (29 December 2009). "GV Krishna Reddy entrepreneur of the year". The Economic Times. Retrieved 12 July 2013.
 5. Doctor of Philosophy http://www.gvk.com/aboutus/boardofdirectors.aspx Archived 2020-05-12 at the Wayback Machine
 6. GVK AISTA http://www.aistatennis.com/ Archived 2018-11-27 at the Wayback Machine
 7. "GVK Novopan Industries Limited :: Sr.Management Team ::GVK Novopan Industries Limited :: MKTG Network". Particle Boards Manufacturing. Novopan. Retrieved 17 July 2013.
 8. Press Information Bureau
 9. "The 9th Construction World Annual Awards 2011 November 2011". Construction. Construction World. Retrieved 12 July 2013.
 10. "Dr. GV Krishna Reddy – India's Greatest Tennis Philanthropist". News. Tennis India Magazine. Archived from the original on 24 ఏప్రిల్ 2013. Retrieved 12 July 2013. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 11. "ET Awards 2008-09: Entrepreneur of the Year: GV Krishna Reddy". The Economic Times. 25 August 2009. Retrieved 12 July 2013.
 12. Bhatia, Dr. R. L. (2012). Real Estate Icons of India (PDF). Fun and Joy at Work. Archived from the original (PDF) on 2019-11-04. Retrieved 2020-06-30.