హాలిడే ఇన్
రకం | Subsidiary of the InterContinental Hotels Group |
---|---|
పరిశ్రమ | Hotels |
స్థాపన | ఆగస్టు 1, 1952 |
స్థాపకుడు | Kemmons Wilson |
ప్రధాన కార్యాలయం | Head office: Denham, England World offices: Rio de Janeiro, Brazil and Atlanta, Georgia, U.S. |
Number of locations | 3,414 |
సేవ చేసే ప్రాంతము | Americas, Europe, Middle East, Africa, Asia-Pacific |
సేవలు | Food services, lodging, conventions, meetings, timeshares |
మాతృ సంస్థ | InterContinental Hotels Group |
విభాగాలు | Holiday Inn Express |
Footnotes / references [1] |
హాలీడే ఇన్
[మార్చు]హాలీడే ఇన్ అనేది వివిధ దేశాల్లో హోటల్స్ లో ఒక ప్రఖ్యాత హోటల్ గా గుర్తింపు పొందింది. ఇది ఎల్.ఎస్.ఇ.-ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్ సముదాయ జాబితాలో భాగంగా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద హోటళ్ల సముదాయంగా పేరుగాంచిన యు.ఎస్. మోటెల్ సముదాయంలో హాలీడే ఇన్ కూడా ఒకటి. యు.ఎస్. మొటెల్ చైన్ లోని మొత్తం 3,463 హోటళ్లకు చెందిన 4,35,299 పడకగదులలో ఏడాదికి 100 మిలియన్ల అతిథులు రాత్రులు ఆతీథ్యం తీసుకుంటుంటారు.[2][3] ఈ హోటళ్ల గొలుసు ప్రధానంగా ముడూ నగరాల్లో ఉంది.అవి: అట్లాంటా, లండన్ మరియ రియో డే జనైరో.
చరిత్ర
[మార్చు]వాషింగ్ టన్, డి.సి. పర్యటన సందర్భంగా తనకు ఓ రోడు పక్కనున్నహోటల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్ట్యా సరికొత్త హోటల్ ప్రారంభించాలన్న ఓ వ్యక్తికి వచ్చిన ఆలోచన నుంచి హాలిడ్ ఇన్ హోటల్ ఆవిర్భవించింది. మెంఫిస, టెన్నెస్సీ లో నివాసముండే కెమ్మన్స్ విల్సన్ అనే వ్యక్తి తన కుటంబంతో సహా పర్యటిస్తుండా ఈ అనుభవం ఎదురైంది. 1942లో క్రిస్ మస్ కథాంశంతో వచ్చిన సంగీత ప్రాధాన్యమైన సినిమా హాలిడే ఇన్ పేరుతో ఈ హోటల్ ఏర్పాటు చేసినట్లు చెబుతుంటారు. [4]
హాలిడే ఇన్ హోటల్... సేవలు అందించడంలో చాలా పేరుగాంచిన హోటల్. దీనిలో రెండు విభిన్న విభాగాలున్నాయి. హై- రైజ్, ఫుల్ సర్వీస్ ప్లాజా హోటల్స్, లో-రైజ్, ఫుల్ సర్వీస్ హోటల్స్ అను రెండు రకాలున్నాయి. 1970 నుంచే వీటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు రెస్టారెంట్లలోనూ పూల్స్, రూమ్ సర్వీసు, వ్యాయామ గది వంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. హాలిడే ఇన్ హోటల్స్ & సూట్లలో అన్ని రకాల సదుపాయలు ఉంటాయి. హాలిడే ఇన్ రిసార్ట్స్ పర్యాటక వ్యాపారం ఎక్కువ జరిగే ప్రదేశాల్లోనే ఉన్నాయి.
గోవాలో హాలిడే ఇన్
[మార్చు]భారత దేశంలోని గోవా రాష్ట్రంలో కూడా హాలీడే ఇన్ హోటల్ ఉంది. గోవాలో 5-స్టార్ సదుపాయాలతో ఏర్పాటు చేసిన హాలిడే ఇన్ హోటల్ ఎంతో మంది పర్యాటకుల మన్ననలు పొందింది. ఈ హోటల్లో సముద్ర ముఖంగా ఉన్న గదుల్లో ఉండడానికి టూరిస్టులు ఎక్కువగా ఇష్టపడుతారు. 5065 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన బాల్ రూం సౌత్ గోవాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఈ హోటల్ గోవాలోని మోబోర్ బీచ్ కు సమీపంలోని కేవ్ లోసిమ్ లో ఉంది. మోబోర్ బీజ్ ఇక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
మార్గావ్ రైల్వే స్టేషన్ నుంచి హోటల్ కు దూరం: సుమారు 20 కిమీ. డబోలిమ్ విమానాశ్రయం నుంచి హోటల్ కు దూరం: సుమారు 48 కిమీ.
గోవా హాలిడే ఇన్ ప్రత్యేకతలు
[మార్చు]గోవా హాలిడే ఇన్ లోని బాల్ రూం అతి పెద్దదే కాకుండా ఇక్కడ జరిగే సమావేశాలకు, ప్రముఖుల కలయికకు ఎంతో అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. విలాసవంతమైన సౌకర్యాలతో పాటు సముద్ర తీరాన్ని వీక్షించే అవకాశం ఈ హోటల్ గదుల్లో ఉంటుంది. చిన్న పిల్లలకు క్రీడా సౌకర్యాలు, తోట ఉన్నాయి. ప్లాజా గార్డెన్ వ్యూ గది, డీలక్స్ గది , చిన్న పిల్లల సూట్, గార్డెన్ సూట్, సూర్యాస్తమయం వీక్షించే సూట్, డీలక్స్ సముద్ర ముఖంగా ఉండే సూట్ వంటి విభాగాలుగా ఈ హటల్లో గదులు లభిస్తాయి. వీటన్నింటిలో ఏసీతో పాటు ఫ్రిజ్, హెయిర్ డ్రయర్, వ్యక్తిగత స్నానాల గదితో పాటు పలు సదుపాయాలు ఉంటాయి. గోవాలోని హాలిడే ప్లాజాగదిలో బస చేసిన వారికి పూల్ /తోట/పాక్షికంగా సముద్రాన్ని వీక్షించే సౌకర్యాలుంటాయి. దీనిలో డబుల్ బెడ్స్, వార్డ్ రోబ్, డెస్క్, కూర్చునే సౌకర్యాలుంటాయి. అటాచ్డ్ బాత్ రూంలో బాత్ టబ్, మినీ బార్, టీ/కాఫీ తయారీతో పాటు రిఫ్రెష్ మెంట్ ఉంటాయి. [5]ఈ గదిలోని టీవీ ద్వారా ఉపగ్రహ వార్తా ఛానళ్లతో పాటు వినోద ఛానళ్లను వీక్షించవచ్చు. ఈ గదిలో టెలిఫోన్ సౌకర్యం కూడా ఉంటుంది. విలువైన వస్తువులకు ఎలక్ట్రానిక్ రక్షణ సదుపాయం ఉంటుంది.అదేవిధంగా డీలక్స్ గదిలో బస చేసిన వారికి ప్లాజా గదిలో ఉన్న సౌకర్యాలన్ని ఉంటాయి. అదనంగా పాటు కాఫీ టేబుల్ ఉంటుంది. ఈగదిలో కూడా విలువైన వస్తువులకు ఎలక్ట్రానిక్ రక్షణ సదుపాయం ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Supplementary Information" (PDF). International Hotels Group. March 31, 2009. Archived from the original (PDF) on 2021-06-03. Retrieved June 6, 2009.
- ↑ "Holiday Inn Express information page". Archived from the original on 2016-09-05. Retrieved 2015-06-26.
- ↑ "Holiday Inn information page". Archived from the original on 2009-02-19. Retrieved 2015-06-26.
- ↑ "Holiday Inn Hotel & suites". multi housing news. Archived from the original on 2015-08-14.
- ↑ "About Holiday Inn Goa". cleartrip.com.
బయటి లింకులు
[మార్చు]- Official website
- Holiday Inn Hotels review
- Holiday Inn relaunch Archived 2009-12-19 at the Wayback Machine
- Balton and Sons Archived 2014-12-29 at the Wayback Machine
- Great Sign history
- "Come Inn off the Highway" - USA Today article, May 24, 2002
- I Remember JFK, a Baby Boomer's Pleasant Reminiscing Spot: Holiday Inns
- New style Holiday Inn Review
- Classic Classy Holiday Inn, A Facebook page commemorating The Great Sign and Holiday Inn
- Pictures of the Great Sign