జి.సత్యనారాయణ రెడ్డి
జి.సత్యనారాయణ రెడ్డి వైద్య శాస్త్రవేత్త.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీవవరంలో జన్మించారు. ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థిగా డా. యల్లాప్రగడ సుబ్బారావు గారికి ఏకలవ్య శిష్యులుగా మారి, స్ఫూర్తి పొందారు. మెడిసన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత 1972లో ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళారు. వెళ్లే ముందు గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతున్న వసంతను వివాహం చేసుకున్నారు.[2]
అమెరికా చేరి విద్యాభ్యాసం చేస్తూ సుబ్బారావు గారి ప్రయోగాలను, తదితర పరిశోధనాంశాలను గూర్చి అధ్యయనం చేసారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగిన కొత్త కొత్త మందుల తయారీకి సంసిద్దమయ్యారు. చిల్డ్రన్ స్పెషలైజేషన్ లో పరిశోధనలు చేసారు. పసిబిడ్డల చికిత్స నిర్వహిస్తూనే కొత్త మందుల రూపకల్పనకు కఠోర పరిశ్రమ చేసారు. విటమిన్ డి లోపంతో దాపురించే రికెట్స్ వ్యాధి పిడిత పిల్లలను పరీక్షించారు. ఆ పిల్లలకు చికిత్సలు జరుపుతూ విటమిన్ డికి సంబంధించిన పరిశోధనలు కొనసాగించారు.[3]
విటమిన్ డికి సంబంధించిన పరిశోధనలో అనేక ఉత్సాహకరమైన అంశాలు ఆవిష్కారమయ్యాయి. ఈ ప్రోత్సాహకర ఫలితాలే సుదీర్ఘమైన ఆయన పాతికేళ్ల పరిశోధనను మరింత అభివృద్ధి పరిచాయి. విటమిన్ డి నుండి విష వ్యర్థాలను తొలగించే పరిశోధనలు ఆవిశ్రాంతం నిర్వహించారు.[4] అధికంగా విటమిన్ డి వాడటంలోనూ (సూర్యకాంతి పుష్కలంగా లభించని అమెరికా వంటి దేశాల్లో పాలతో విటమిన్ డి తీసుకొనే అలవాటు ఉంది) కాన్సర్, కిడ్నీ వ్యాధుల్లో విటమిన్ డి వాడవలసినప్పుడు దుష్పరిణామాల బెడద ఉండేది. వ్యర్థ పదార్థాలను తొలగించగలిగే విటమిన్ డి నిరభ్యంతరంగా, ఆనందంగా వాడవచ్చునని తేల్చుకున్నారు.[5]. పాతికేళ్ళ పరిశోధనా బలమే ఈయనకు ఇందుకు మార్గాన్ని చూపింది. అతి తక్కువ వ్యర్థపదార్థాల విటమిన్ డి ఆధారిత మందులు తయారుచేసారు. కొలన్, బ్రెస్ట్ కాన్సర్, కిడ్నీ పాడయిన కేసులలో ఈ వినుత్న విటమిన్ డి మందులు ప్రతిభావంతంగా పని చేయడాన్ని ఈయన పరిశోధనలు నిరూపించారు.[2]
ఈయన సుదీర్ఘ పరిశోధనలు 1985లో విజయవంతమయ్యాయి. డిసెంబరు 25 వ తేదీన విటమిన్ డి నుండి విజయవంతంగా విషతుల్య పదార్థాలను తొలగించ గలిగారు. ఈయన తరయారుచేసిన మందును కిడ్నీ పాడయిన వారి కోసం వాడి, ఫలితాలను సాధించడంతో గుర్తింపు వచ్చింది. పేటెంట్ తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మందుల కంపెనీలు దీని తయారీకి ముందుకు వచ్చాయి.
ఈయన పరిశోధనా ఫలితాలు కేన్సర్ వ్యాధులకే కాకుండా మన దేశంలో అత్యధికంగా ఉన్న సొరియాసిన్ వ్యాధి చికిత్సలో ఫలితాలను సాధిస్తున్నాయి. కొత్త విటమిన్ డి ఆధారిత మందులు ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయని తేలింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Dr GSN Reddy Clinic[permanent dead link]
- ↑ 2.0 2.1 2.2 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011.
- ↑ vitamin D metabolism - vitamin D volume-1 by David feldman, page no. 15-35
- ↑ research data of g.sagyanarayana reddy
- ↑ studies in chronic myeloid leukemia (RWLeu-4) cells and rat kidney