జీన్ లూక్ గొడార్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జేన్ లూక్ గొడార్డ్ (ఫ్రెంచ్[ʒɑ̃lyk ɡɔdaʁ]; జననం 1930 డిసెంబరు 3) ఫ్రెంచ్-స్విస్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినీ విమర్శకుడు. ఆయనని తరచుగా 1960ల నాటి ఫ్రెంచి సినిమా ఉద్యమం లా నౌవెల్లె వాగ్, లేదా నవతరంగం (న్యూవేవ్) కు చెందినవాడిగా గుర్తిస్తారు.[1]

ఇతర నవతరంగం సమకాలీకుల్లాగానే, గొడార్డ్ ప్రధాన స్రవంతి ఫ్రెంచ్ సినిమాలో "నూతన ఆవిష్కరణకు బదులు నిపుణత, కొత్త దర్శకులకు బదులు ప్రత్యేక సౌకర్యాలు అనుభవించే పాతవారికి ప్రాధాన్యత ఇచ్చే" నాణ్యతా ప్రమాణాలు, సంప్రదాయాలను విమర్శించారు[1]  [2] ఈ సంప్రదాయాన్ని ఎదిరించేందుకు ఆయన, ఆయన వంటి ఆలోచనలే కలిగిన తోటి విమర్శకులు సినిమాలు తీయడం ప్రారంభించారు.[1] ఫ్రెంచ్ సినిమాలతో పాటుగా సంప్రదాయిక హాలీవుడ్ విధానాలను కూడా గొడార్డ్ తీసిన అనేక సినిమాలు సవాలుగా నిలుస్తాయి.[1] 1960లు, 70ల్లో అత్యంత రాడికల్ ఫ్రెంచ్ సినీ రూపకర్తగా ఆయనను తరచు పేర్కొంటూంటారు;[4] సినీ సంప్రదాయాలు, విధానాలు, రాజకీయాలు, ఫిలాసఫీ వంటివాటిపై ఆయన దృక్పథం ఫ్రెంచ్ నవతరంగం (న్యూవేవ్) కు చెందిన దర్శకులపై గట్టి ప్రభావం చూపించింది. ఆయన సినిమాల్లో పలు పూర్వపు గొప్ప చిత్రాల రిఫరెన్సులు, వాటిలోని అంశాలు గౌరవప్రదంగా చూపడం వంటివి ఆయనకు సినిమా చరిత్రపై ఉన్న లోతైన అభినివేశాన్ని తెలుపుతాయి. దాంతో పాటు అనేక సినిమాలు ఆయన రాజకీయ దృక్పథాలకు ప్రతిబింబాలుగా నిలిచాయి; అస్తిత్వవాదం, మార్క్సిస్టు సిద్ధాంతాలను చాలా ఆసక్తితో చదివేవారు.[4][2]

నవతరంగం నాటితో పోలిస్తే, ఆయన ఇటీవలి సినిమాల్లోని రాజకీయ దృక్పథంలో రాడికల్ తత్త్వం తగ్గిపోయింది, ఇటీవలి సినిమాలు సంకేతాత్మకమైనవీ, వాటిలో మానవవాద, మార్సిస్ట్ దృక్పథాల నుంచి మానవ సంఘర్షణ చూపుతున్నారు.[3]

2002ల్ సైట్ & సౌండ్ పోల్ లో, గొడార్డ్ సినీ విమర్శకుల ఆల్-టైం టాప్ 10 దర్శకుల లిస్టులో మూడవ ర్యాంకు పొందారు.[4] ఆయన, ఆయన కృషి కథన సిద్ధాంతానికి కేంద్రంగా నిలుస్తూ, "వాణిజ్య కథన సినిమా నియమాలనూ, సినీ విమర్శ సాంకేతిక పదజాలాన్నీ కూడా సవాలు చేశాయి" అని పేర్కొన్నారు.[5] 2010లో, గొడార్డ్ అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) పొందారు, అయితే ఆయన అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేదు.[6] గొడార్డ్ సినిమాలు మార్టిన్ స్కోర్సెస్, క్వెంటిన్ టరంటినో, స్టీవెన్ సోడెర్ బర్గ్, డి.ఎ.పెనెబేకర్, [7] రాబర్ట్ ఆల్ట్మాన్, జిమ్ జర్మస్క్, వాంగ్ కర్-వాయ్, విమ్ వెండెర్స్, [8] బెర్నార్డో బెర్టొలుక్కి, [9] పీర్ పోలో పసోలినిలు సహా ఎందరో చలనచిత్ర దర్శకులకు స్ఫూర్తినిచ్చాయి[9]

References[మార్చు]