జీయాస్ విగ్రహం-ఒలింపియా
ప్రపంచంలో మూడవ వింతగా చెప్పుకునే జీయాస్ విగ్రహం గ్రీసు దేశంలో ఉంది. ఈ దేవతనే "జూపిటర్" అని కూడా అంటారు. ఇది సుమారు 13 మీటర్లు (42 అడుగులు) పొడవు ఉంటుంది.[1] గ్రీస్ దేశానికి చెందిన ప్రఖ్యాత శిల్పి ఫిడియాస్ ఈ బృహత్తర జూపిటర్ విగ్రహాన్ని క్రీ.పూ 430-422 మధ్య కాలంలో రూపొందించారు. ఈ విఖ్యాత శిల్పి తయారు చేసిన మరో విగ్రహం పార్థినాన్ లోని "ఎథెన్నా " శిల్పం.
పశ్చిమ గ్రీస్ లో ఒలింపియా వద్ద నున్న గొప్ప దేవాలయంలో ఈ జీయాస్ విగ్రహం నెలకొని ఉంది. ఈ ఆలయం గ్రీస్ లోకల్లా చాలా పెద్దది. ఎథెన్నా విగ్రహం లాగానే ఈ జీయస్ విగ్రహాన్ని క్రిసిలి ప్లాంటైన్ తో రూపొందించటం జరిగింది.ఈ విగ్రహం బంగారం,దంతంతో నిర్మాణమైనది. ఈ విగ్రహం నిర్మాణంలో దంత శిల్ప నైపుణ్యం చెప్పుకోదగినది. ఈ విగ్రహం జీయాస్ దేవుడు ఉన్నతాసనంపై కూర్చున్న విధంగా ఉంటుంది. ఇది ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా నిలిచింది.[2] ఈ జీయాస్ విగ్రహం యొక్క నకలులు ఎక్కడా మనకు కానరావు. కానీ ప్రాచీన గ్రీకు చరిత్రలో కొన్ని నాణేలపై ఈ చిత్రాలను చూడవచ్చు.
వర్ణన
[మార్చు]ఈ విగ్రహం మానవుని కన్నా 8 రెట్లు పెద్దది. విగ్రహం ఎత్తు దాదాపు 13 మీటర్లు ఉంటుంది. దేవాలయం పైకప్పును అంటుకుంటుంది.[3] జీయాస్ జిడర్‌వుడ్ (రక్త చందనం) సింహాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది. ఈ సింహాసనాన్ని పబొని, దంతం,బంగారం,అమూల్యమైన మణిమాణిక్యాలు, రత్నాలతో అలంకరించబది ఉంటుంది.[4] విగ్రహం దుస్తులు బంగారంతో,దంతపు పేడుతో చేయబడ్డాయి. కళ్లు అమూల్యమైన మణులతో పొదగబడ్డాయి. జీయస్ ఎడమ చేతిలో భయంకరమైన రూపంలో బంగారంతో చేయబడిన గ్రద్ద బొమ్మ ఉంటుంది.[5] ఈ గ్రద్ద తలలా ఉంటుంది.కుడిచేయి చాపబడి నైక్ విగ్రహాన్ని పట్టుకుని ఉంటుంది. నైక్ గ్రీకులను విజయాన్ని ప్రసాదించే దేవత. ఈ విగ్రహాన్ని రూపొందించటానికి ఫిడియాస్ కు 8 సంవత్సరాలు పట్టిందట. ఈ విగ్రహం దైవత్వాన్ని ఉట్టిపడుతూ హుందాగా ఉంటుంది. విగ్రహం ముఖంలో మంచితనం పరిఢవిల్లుతూ ఉంటుంది. ఒలింపియాస్ జీయాస్ విగ్రహానికి పొడవైన కేశ సంపద,ఒత్తైన మీసం,రెండో చివర కొనలు పొడుగ్గా ఉంటుంది. తలపైన కిరీటంలా ఆలివ్ కొమ్మలతో రూపొందిన కిరీటం ఉంటుంది. సింహాసనం వివిధములైన పెయింటింగ్స్ అనేక రకాల అడవి జంతువుల బొమ్మలతో అలంకరించబడి ఉంటుంది.
జీయాస్
[మార్చు]గ్రీకులకు జీయాస్ ప్రధాన దైవం. ఆయన్ను మానవులకు, జంతువులకు కూడా పితరునిగా అంటే తండ్రిగా భావిస్తారు. జీయస్ గ్రీకుల సిద్ధాంత రీత్యా దేవతలందరికీ అధిపతి. సర్వాధికారి. ఆయన రక్షకుడు. ఆయనే వినాశకారకుడు.పిడుగు,గ్రద్దలకు ఆయన చిహ్నాలు. జియస్ కు హీరో అనే జూనోతో వివాహం జరిగింది. ఆయన ప్రేమ అంటే కదిలిపోతాడు. ఆయన అనేక మంది దేవతల ద్వారా పుత్రులు కలిగి యున్నారు. దేవతలు మరణించలేనివారుకదా. మరణించే అనేక జీవులతోకూడా ఆయన సంతానాన్ని కన్నారు. ఆయన జంతు రూపం ధరించి జంతువులతో కూడా సంతానాన్ని కన్నారు.ఆయన హంస రూపం ధరించి లేడాతో, ఎద్దు రూపం ధరించి యురోపాలో ప్రేమాయణం సాగించారు.
ఆయన సంతానంలో అపోలో, అర్టిమిస్,హెలెన్,దియోస్కూరీ,పెర్సిఫోల్,ఎధినా,హెర్మన్,డయానోసిన్ కొందరు మాత్రమే. వీరిని దేవతా రూపాలుగా గ్రీకులు ఆరాధిస్తారు. గ్రామ దేవతలలో వీరికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
జీయాస్ పేర పండుగ
[మార్చు]జీయాస్ పేర జరిగే పండుగను, డైయనోలైల్సా పాండియా అని గూడ పిలుస్తారు. ఈ సందర్భంగా జీయస్ దేవాలయంలో భవిష్యద్వాణి వినిపించడం,అదృష్టాన్ని వివరించడం జరుగుతుంది. తన శక్తి నిరూపణ కోసం, తన శక్తులను మానవ ప్రపంచం ఆమోదించడం కోసం తన శక్తిని తిరుగు లేదని ఋజువు చేయడం కోసం, జీయస్ భూమి మీదకు పిడుగును ప్రయోగించారు అని గ్రీకు పురాణ కథనం.రోమీయులు జీయాస్ ను తమ దేవత జూపిటర్ గా గుర్తించి ఆరాధించేవారు. కలిగులా చక్రవర్తి జీయాస్ విగ్రహాన్ని రోము నగరానికి తీసుకుని వెళ్ళి జీయాస్ శిరసు బదులుగా తన శిరస్సును ఆ విగ్రహానికి అమర్చాలని ఆశించాడట[6]. జీయాస్ దేవాలయంలో హఠాత్తుగా వెన్ను జలదరించేలా భయంకరమైన వికటాట్టహాసం ప్రారంభమయిందని[7], ఆ నవ్వును భరించలేని కలిగులా చక్రవర్తి పనివారు దేవాలయం నుండి పారిపోయారట.
శిధిలాపస్థలో జీయాస్ విగ్రహం
[మార్చు]ఒకటవ థియోడరస్ చక్రవర్తి జీయాస్ విగ్రహాన్ని కాన్‌స్టాంట్ నోపుల్ కు తరలించాడు[8]. అక్కడే ఉన్న విగ్రహం సా.శ.475 లో అగ్ని ప్రమాదానికి గురియై శిథిలమయిందట.కాని జీయాస్ దేవాలయం శిథిలాలను ఈ నాటికీ మనం "ఒలింపియా" వద్ద దర్శించవచ్చు. ప్రసిద్ధ శిల్పి "ఫిడియాస్" జీయాస్ విగ్రహాన్ని తయారుచేయడంలో బంగారు భాగాలను పోత పోసిన మూసలే ఇటీవల చారిత్రక పరిశోధకులకు లభ్యమయ్యాయి. కొన్ని అత్యాశ్చర్యకమైన బహుసుందరమైన శిథిల శిల్పాలు, ఆ దేవాలయం ప్రాంగణంలోనే లభించాయట[9][10][11]. ఆసక్తి కలవారు వాటిని దర్శించవచ్చు.
యివి కూడా చూడండి
[మార్చు]సూచికలు
[మార్చు]- ↑ Phidias from encyclopædiabritannica.com. Retrieved 3 December 2012
- ↑ Statue of Zeus from encyclopædiabritannica.com. Retrieved 22 November 2006
- ↑ Alaa K. Ashmawy. The Seven Wonders: The Statue of Zeus at Olympia]." Retrieved on 2 December 2001.
- ↑ Gisela M. A. Richter, "The Pheidian Zeus at Olympia" Hesperia 35 .2 (April–June 1966:166-170) pp. 166f, 170. Details of the sculpture in this article are corroborated in the Richter article.
- ↑ "On his head is a sculpted wreath of olive sprays. In his right hand he holds a figure of Victory made from ivory and gold. In his left hand, he holds a sceptre inlaid with every kind of metal, with an eagle perched on the sceptre. His sandals are made of gold, and his robe is also gold. His garments are carved with animals and with lilies. The throne is decorated with gold, precious stones, ebony, and ivory." (Pausanias, Description of Greece 5.11.1-.10). Pausanias was informed that the paintings on the throne were by the brother of Phidias, Panaenus.
- ↑ Suetonius, Gaius 2.2; compare Cassius Dio, 59.28.3.
- ↑ Suetonius, Gaius, 57.1
- ↑ Georgius Kedrenos, Historiarum Compendium §322c, in Corpus Scriptorum Historiae Byzantinae 34, vol. I, p. 564, according to Richter 1966 note 1.
- ↑ "Phidias", Oxford Dictionary of Art, e-Notes.com
- ↑ K. Kris Hirst, "A Walking Tour of Olympia, Greece Archived 2011-06-11 at the Wayback Machine," about.com
- ↑ "Olympia, Workshop of Pheidias[permanent dead link]," Perseus Building Catalog, about.com
గ్రంథ పట్టిక
[మార్చు]- Kenneth D. S. Lapatin, Chryselephantine Statuary in the Ancient Mediterranean World, Oxford University Press (2001) ISBN 0-19-815311-2
- Alfred Mallwitz and Wolfgang Schiering, Die Werkstatt des Pheidias in Olympia I: Olympische Forschungen V, Berlin: Walter de Gruyter (1964)
- Wolfgang Schiering, Die Werkstatt des Pheidias in Olympia II: Werkstattfunde: Olympische Forschungen XVIII, Berlin: Walter de Gruyter (1991) ISBN 3-11-012468-8
యితర లింకులు
[మార్చు]- "The Statue of Zeus at Olympia"
- Colin Delaney, "A Wonder to Behold: The Statue of Olympian Zeus" Archived 2006-05-04 at the Wayback Machine
- Archaeopaedia: Statue of Zeus With bibliography
- (Ellen Papakyriakou) Olympia: Art: the chryselephantine statue of Zeus
- Michael Lahanas, "The colossal Zeus statue of Pheidias"
- David Fenzl "Recreating Olympic Statuary"
- History.com: the Seven Wonders