Jump to content

మాచు పిచ్చు

వికీపీడియా నుండి


మాచు పిచ్చు
మచు పిక్చు
స్థానంకుస్కో రీజియన్, పెరూ
ఎత్తు2,430 మీటర్లు (7,970 అ.)
చరిత్ర
స్థాపన తేదీc. 1450
వదిలేసిన తేదీ1572
సంస్కృతులుఇంకా నాగరికత
అధికారిక పేరుహిస్టారిక్ శాంక్చురీ ఆఫ్ మాచు పిచ్చు
రకంమిశ్రమ
క్రైటేరియాi, iii, vii, ix
గుర్తించిన తేదీ1983 (7 వ సెషన్)
రిఫరెన్సు సంఖ్య.274
State Party Peru
Regionలాటిన్ అమెరికా, కరేబియన్

మచు పిచ్చు (ఆంగ్లం: Machu Picchu) అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల (7,970 అడుగులు) ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ప్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. ఇది 80 కిలోమీటర్ల దూరంలోని (50మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్ర లోయ పైన ఒక పర్వత శిఖరం పైన ఉన్నది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తున్నది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచు పిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438-1472) కోసం నిర్మించబడిన ఒక ఎస్టేట్ వంటిదని నమ్ముతారు. తరచుగా పొరపాటుగా "లాస్ట్ సిటీ ఆఫ్ ది ఇంకాస్"గా సూచిస్తారు, ఇది బహుశా ఇంకా నాగరికతకు సరసమైన చిహ్నం.

ఇది స్థానికంగా పేరు గడించినప్పటికీ, అమెరికా చరిత్రకారుడు హిరం బింగం 1911లో అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చేంత వరకు దీని గురించి బయట ప్రపంచానికి తెలియదు. అప్పటి నుండి మచు పిచ్చు ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారింది. మచు పిచ్చు 1981లో ఒక పెరువియన్ హిస్టారికల్ అభయారణ్యంగా, 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. 2007లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్ లో ప్రపంచ న్యూ సెవెన్ వండర్స్ లో ఒకటిగా మచు పిచ్చుకి ఓటింగ్ జరిగింది.

సందర్శన నిషేధం

[మార్చు]

పెరూ దేశాధ్యక్షుడు డినా బులెర్టోకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మచు పిచ్చుకు పర్యాటకులను ప్రభుత్వం 2023 జనవరి 21 నుంచి అనుమతించడం లేదు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. మరోవైపు మచు పిచ్చుకు వచ్చే రైల్వే లైన్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో మొత్తం 417 మంది పర్యాటకులు చిక్కుకుపోగా అందులో 300 మంది విదేశీ టూరిస్టులు ఉన్నారు.[1]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పెరూలో ఆగని ఆందోళనలు.. మచు పిచ్చు సందర్శనకు బ్రేక్‌". web.archive.org. 2023-01-22. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)