జీవక్రియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంగ్లీష్ పరిభాషతో టెక్స్ట్-బుక్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ నుండి ఒక శరీర నిర్మాణ పటం

జీవకణంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొన వచ్చును. ఈ చర్యలు జీవం మనుగడకు అత్యావశ్యకమైనవి. వీటి వలన జీవ కణాల్లో పెరుగుదల, అభివృద్ధి, నిర్మాణము, పరిసరానుగుణ్యత మొదలగు అంశాలు చోటుచేసుకుంటాయి.

జీవక్రియను ప్రధానంగా రెండు రకాలుగా విభజించ బడినాయి. అవి కెటబాలిక్ చర్యలు (విశ్లేషణ), ఎనబాలిక్ చర్యలు (సంశ్లేషణ). శ్వాస వ్యవస్థలోని ఆహార వినిమయము కెటబాలిక్ చర్యలకు ఉదాహరణ అయితే, తత్ఫలితంగా వచ్చిన శక్తి ద్వారా మాంసకృత్తులు, కేంద్రక ఆమ్లాలు ఉత్పాదన ఎనబాలిక్ చర్యల క్రిందికి వస్తుంది.

జీవక్రియ యొక్క రసాయనిక చర్యలన్నీ జీవ రసాయనిక పథము (metebolic pathways) లలో అమర్చబడి ఉంటాయి. వీటిలో ఒక రసాయనిక పదార్ధము జీవౌత్ప్రేరకముల (enzymes) సహాయముతో మరొక రసాయనిక పదార్ధముగా మార్పు చెందుతుంది. ఉష్ణగతిక శాస్త్రము (thermodyanamics) యొక్క నియమాలకు విరుద్ధమైనప్పటికీ ఆవశ్యకమైన రసాయన చర్యలు నిర్వహించుటలో జీవౌత్ప్రేరకాలు ముఖ్య భూమిక వహిస్తాయి. ఈ జీవౌత్ప్రేరకాలు కణము లోని జీవరసాయనిక చర్యా పథములను, బాహిర కణముల నుండి వచ్చు సంకేతములను, కణ స్వభావాన్ని నియంత్రించుటలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఒక జీవజాలంయొక్క జీవక్రియ మాత్రమే ఏయే పదార్ధాలు పోషకములో ఏవి విషపూరితములో నిర్దేశించుతాయి. ఉదాహరణకి కొన్ని కేంద్రకరహిత జీవులు (prokaryotes) ఉదజని సల్ఫైడు (hydrogen sulfide) ను పోషకముగా స్వీకరిస్తాయి. కానీ ఈ వాయువు జంతువులకు విషపూరితము. జీవక్రియ యొక్క వేగమే ఒక జీవికి ఎంత ఆహారము అవసరము అనే అంశాన్ని నిర్ణయిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=జీవక్రియ&oldid=3878308" నుండి వెలికితీశారు