Jump to content

జీవన నైపుణ్యం

వికీపీడియా నుండి


జీవితాన్ని చక్కని కార్యక్రమతతో, సమర్థవంతంగా జీవించుటకై అంతర్గత నైపుణ్యాన్ని అభివృద్ధిపరచే నిరంతర, తగినట్టి ప్రయత్నమే జీవన నైపుణ్యం. [1]

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇందుకోసం ఈ క్రింది విధమైన పది జీవన నైపుణ్యాలను జారీ చేసింది.[2]
1. స్వీయ జాగృతి (Self-awareness): తన సామర్థ్యం , పరిమితులు, ఇష్టాయిష్టాలు, ఆకాంక్షలు గుర్తించే నైపుణ్యం.
2. సమానుభూతి (Empathy): ఇతరుల పాత్రలో ప్రవేశించి ఆలోచించే నైపుణ్యం,
3. సమస్యా పరిష్కారం (Problem Solving): అందుబాటులోనున్న ప్రత్యామ్న్యా యాల నుండి యోగ్యమైన, శ్రేష్ఠమైన ప్రత్యామ్న్యాయాన్ని ఎంచుకొనే నైపుణ్యం,
4. నిర్ణయం తీసుకొనుట (Decision Making): సమస్యను సాధించే ప్రక్రియలో అనేక ప్రత్యామ్న్యాయాలను వెదికి అందులోనుండి సరియైన పర్యాయాన్ని స్వీకరించే నైపుణ్యం.
5. ప్రతిభా పూర్వక భావ వ్యక్తీకరణ (Effective communication): తన ఆలోచనలను మౌఖికంగాగాని చేతల ద్వారా గాని ప్రతిభావవంతంగా వ్యక్త పరిచే నైపుణ్యం.
6. విమర్శనాత్మక ఆలోచన (Critical thinking): అందుబాటులోని సమాచారాన్ని విశ్లేషించే, గుణదోషాలను స్థూలంగా పరిక్షించే నైపుణ్యం.
7. సృజనాత్మక ఆలోచన (Creative thinking): సాంప్రదాయకమైన, పునారావృత్తమయ్యే పద్ధతులకంటే భిన్నంగా, అభినవ పద్ధతుల్లో ఏదేని సమస్య లేదా పరిస్థితిని గూర్చి ఆలోచించే నైపుణ్యం.
8. పరస్పర వ్యక్తిగత సంబంధాలు (Interpersonal relation): నిత్య జీవితంలో ఎల్లప్పుడు తన సహవాసంలో ఉండే వారితో గల సబంధాలను గుర్తించి ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించే నైపుణ్యం.
9. భావ నియంత్రణ (Coping with emotions): తన, పరులభావనలు, అలాగే వాటివలన ఏర్పడే పరిణామాలు గుర్తించి, వాటిని నియంత్రించే నైపుణ్యం.
10. ఒత్తిడి నియంత్రణ (Coping with stress): ఒత్తిడి కలిగించే కారణాలను వెదకి వాటివలన ఏర్పడే శారీరక, మానసిక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అదుపు చేసే నైపుణ్యం.

మూలాలు

[మార్చు]
  1. https://nutspace.in/10-core-life-skills/
  2. https://www.who.int/mental_health/media/en/30.pdf?ua=1

వెలుపలి లంకెలు

[మార్చు]